
దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగి టాలీవుడ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది శోభితా ధూళిపాళ్ల. మేజర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆమె.. ఇప్పుడు ఆమె చీకటిలో సినిమాలో చేస్తుంది. కిరాక్ పార్టీ, తిమ్మరసు వంటి సినిమాలను తెరకెక్కించిన శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. తాజాగా విడుదలైన ట్రైలర్ గమనిస్తే.. చేసే పని నచ్చక కొత్తగా పోస్ట్ కాడ్ పెట్టి చీకట్లో అంటూ అసలైన క్రైమ్ స్టోరీలను ఈ ప్రపంచానికి చెబుతుంటుంది శోభితా. నగరంలో జరిగిన హత్య కేసు చివరకు ఆమెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గోదావరి జిల్లాలో లాస్ట్ 20 ఏళ్లలో జరిగిన హత్య కేసులను ఆధారంగా చేసుకుని ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా అనే విషయాలపై పోడ్ కాస్టులో వివరిస్తుంది.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
నగరంలో జరిగన హత్యకు గోదావరి జిల్లాలో వరుస హత్యలకు చేసింది ఒకరేనా.. ? కిల్లర్ హత్యలు ఎందుకు చేస్తున్నాడు అనే విషయాలు తెలియాలంటే జనవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోయే చీకటిలో సినిమాను చూడాల్సిందే. చాలా కాలం తర్వాత అడియన్స్ ముందుకు రాబోతుంది.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
తాజాగా విడుదలైన ట్రైలర్ అదిరిపోయింది. ఇందులో శోభిత యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. ఇందులోని రూల్ మంచి ఇంపాక్ట్ చూపించేలా ఉంది. క్రైమ్, సస్పెన్స్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా శోభితాకు మంచి క్రేజ్ తీసుకువచ్చేలా కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..