OTT Movie: 8 కోట్లతో తీస్తే 83 కోట్లు.. IMDbలో 8.6 రేటింగ్‌.. ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్

గత నెలలో థియేటర్లలో చిన్న సినిమాగా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించంది. ఆల్ టైమ్ క్లాసిక్స్ సినిమాల జబితాలో చేరింది. కేవ‌లం రూ.8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ పెట్టిన దానికి ప‌దింతల లాభాలు తెచ్చి పెట్టింది. ప్ర‌పంచ వ్యాప్త‌గా రూ.80 కోట్ల‌కు పైగానే వసూళ్లు రాబట్టింది.

OTT Movie: 8 కోట్లతో తీస్తే 83 కోట్లు.. IMDbలో 8.6 రేటింగ్‌.. ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్
OTT Movie

Edited By: TV9 Telugu

Updated on: Sep 04, 2025 | 10:09 AM

ఇటీవల కాలంలో ఈ సినిమా పేరు తెగ వినిపించింది. సోషల్ మీడియాలోనూ మార్మోగిపోయింది. ఎక్కడ చూసినా ఈ సినిమా పోస్టులే కనిపించాయి. స్టార్ హీరోలు, హీరోయిన్లు లేరు. ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు. అసలు థియేటర్లలోకి వచ్చాక గానీ ఈ మూవీ గురించి పెద్దగా జనాలకు తెలియదు. పైగా పోటీగా సూర్య నటించిన రెట్రో సినిమా కూడా రిలీజైంది. కానీ కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే చాలు స్టార్ హీరోలు, హీరోయిన్స్ అవసరం లేదని ఈ సినిమా నిరూపించింది. ఫ్యామిలీ, కామెడీ, ఎమోష‌న‌ల్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది. అలాగే బాగా ఏడిపించింది కూడా. ప్ర‌తి ఒక్క‌రినీ కంట‌త‌డి పెట్టించే స‌న్నివేశాలు గుండెల‌ను పిండేస్తాయి. అందుకే ఈ సినిమాకు అందరూ కనెక్ట్ అయ్యారు. థియేటర్లలో ఎగబడి చూశారు. ఇక స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను చూసి ఫిదా అయ్యారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, దర్శక ధీరుడు రాజమౌళి, న్యాచురల్ స్టార్ నాని, శివ కార్తికేయన్ తదితర స్టార్లందరూ ఈ సినిమాను చూసి టీమ్ కు అభినందనలు తెలిపారు. మరి ఇంతలా పేరు తెచ్చుకున్న ఆ సినిమా ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. యస్.. ఆ సినిమా మరేదో కాదు టూరిస్ట్ ఫ్యామిలీ.

 

ఇవి కూడా చదవండి

శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలలో నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాకు అభిషాన్ దర్శకత్వం వహించారు. యోగిబాబు, ఎమ్ఎస్ భాస్కర్, భగవతి, శ్రీజా రవి తదితరులు ఇతర పాత్రల్ల ఓఆకట్టుకున్నారు. తమిళంలో మే 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. ఇంకా చాలా చోట్ల థియేట‌ర్ల‌లో టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాకు హౌస్ ‌ఫుల్ క‌లెక్ష‌న్లు వస్తున్నాయి. అయితే ఇంతలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలోనూ ఈ సినిమా అందుబాటులో ఉది. థియేటర్లలో మిస అయ్యింటే మాత్రం కచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే.

జియో హాట్ స్టార్ లో టూరిస్ట్ ఫ్యామిలీ..

ఇవి కూడా చదవండి..

Tollywoood: అప్పుడు బొద్దుగా.. ఇప్పుడు సన్నజాజి తీగలా.. 6 నెలల్లో 55 కిలోలు తగ్గిన హీరోయిన్.. ఎలాగంటే?

Balakrishna: బాలయ్య పక్కన నటించి.. ఆఖరికి ఆ ఇంటికే కోడలిగా వెళ్లిన స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?