45 Movie OTT: అప్పుడే ఓటీటీలోకి ఉపేంద్ర, శివన్నల బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులోనూ ’45’ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

కన్నడ స్టార్ హీరోలు శివ రాజ్‌కుమార్‌, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘45. గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. తెలుగులోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

45 Movie OTT: అప్పుడే ఓటీటీలోకి ఉపేంద్ర, శివన్నల బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులోనూ 45 స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
45 Movie

Updated on: Jan 16, 2026 | 4:15 PM

ఇటీవల కన్నడ నాట విడుదలైన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ 45. సూపర్ స్టార్స్ గా వెలుగొందుతోన్న శివ రాజ్‌కుమార్‌ , ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. అర్జున్‌ జన్యా తెరకెక్కించిన ఈ మూవీ గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజువల్ వండర్‌గా, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో కూడిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. తెలుగులో ఒక వారం (జనవరి 01)న ఆలస్యంగా విడుదలైనా 45 మూవీకి మంచి ఆదరణే వచ్చింది. హాలీవుడ్ సినిమాలను తలపించే యుద్ధ సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్సులు, వీఎఫ్ ఎక్స్ తదితర అంశాలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. అయితే తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో ఈ మూవీ పెద్దగా ఆడియెన్స్ కు ఎక్కలేదు. థియేటర్లలో ఆడియెన్స్ ను ఆకట్టుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ మల్టీస్టారర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా 45 మూవీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. జనవరి 23 నుంచి ఈ కన్నడ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది.

సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో 45 సినిమాను నిర్మించారు. డాక్టర్ కె రవి వర్మ, జాలీ బాస్టియన్, డిఫరెంట్ డానీ, చేతన్ డిసౌజా వంటి ప్రముఖ ఫైట్ మాస్టర్లు ఈ సినిమాకు పనిచేశారు.అనిల్ కుమార్ మాటలు అందించగా, సత్య హెగ్డే కెమెరామెన్‌గా, కె.ఎం. ప్రకాష్ ఎడిటర్‌గా పని చేశారు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

మూడు వారాలకే ఓటీటీలోకి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.