విలక్షణ హీరో సత్యదేవ్.. మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. డైరెక్టర్ నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో వాయిదాల అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అనుకున్నంతగా ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. అందమైన ప్రేమకథాచిత్రంగా వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ మాత్రం సొంతం చేసుకుంది. ఇక థియేట్రికల్ రన్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. శుక్రవారం నుంచి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చేసింది. ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా నేరుగా ఈ చిత్రాన్ని ఓటీటీలోకి రిలీజ్ చేశారు మేకర్స్. ఇక థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ చేసుకున్నవారు ఇప్పుడు ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
ఇందులో సత్యదేవ్ ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతని జీవితంలో ఎదురైన అమ్మాయిలు.. వారితో జరిగిన ప్రేమాయణమే గుర్తుందా శీతాకాలం. ఓ మిడిల్ క్లాస్ కుర్రాడి జీవితంలోకి వివిధ దశల్లో అడుగుపెట్టిన ఆ అమ్మాయిల కారణంగా అతని లైఫ్ ఎలాంటి టర్నింగ్స్ తీసుకున్నదన్నదే ఈ చిత్రం కథ. చివరకు నిధి(తమన్నా)ను చూడాలనుకున్న మేఘా ఆకాష్ కోరికను దేవ్ తీర్చడంతో సినిమా ముగుస్తుంది.
ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు హీరోగా ఆకట్టుకున్న సత్యదేవ్.. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో విలనిజంలోనూ మెప్పించాడు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవికి ఎదురు తిరిగిన పాత్రలో సత్యదేవ్ నటనకు ప్రశంసలు అందుకున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.