18 Pages: ఇట్స్ అఫీషియల్.! ’18 పేజెస్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కించిన చిత్రం ’18 పేజెస్’.
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కించిన చిత్రం ’18 పేజెస్’. డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా మంచి సక్సెస్ అందుకున్నా.. కలెక్షన్ల విషయంలో మాత్రం ఫర్వాలేదనిపించింది. ఇక ఇప్పటిదాకా థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా.. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ’18 పేజెస్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ సినిమాను జనవరి 27 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంచనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది. అటు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ చిత్రం విడుదల కానుండగా.. అదే తేదీన స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా, ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాసు నిర్మించారు. అలాగే దర్శకుడు సుకుమార్ కథను అందించిన సంగతి తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ఈ మూవీకి సంగీతం అందించాడు.
Sukumar Writings antene oka magic✨ Aa pen nunchi vachina oka thrilling and touching blockbuster 18 Pages.#18PagesOnAHA – Available to read?.. sorry watch from January 27th!❤️#18Pages #AlluAravind @aryasukku @actor_Nikhil @anupamahere @dirsuryapratap @GopiSundarOffl pic.twitter.com/yzwDfzMjcQ
— ahavideoin (@ahavideoIN) January 20, 2023