
భారీ అంచనాల మధ్య విడుదలై అట్టర్ ప్లాప్ అయిన సినిమాల గురించి వినే ఉంటారు. ఈ ఏడాది ఓ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని రెస్పాన్స్ అందుకుంది. కానీ ఇప్పుడు ఆ మూవీ ఓటీటీని ఊపేస్తుంది. బాక్సాఫీస్ వద్ద హిట్ కాకపోయినా ఇప్పుడు ఓటీటీ సినీప్రియులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఆ సినిమా దేశంలోనే టాప్ ట్రెండింగ్. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ? అదే సికందర్. యాక్షన్ థ్రిల్లర్ డ్రామగా రూపొందించిన ఈ సినిమా ఈ సంవత్సరం ఈద్ సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ పాత్రలో కనిపించింది. అలాగే శర్మన్ జోషి, సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ వంటి తారలు ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.
ఈ సినిమా కథ మొత్తం సంజయ్ రాజ్‌కోట్ అంటే సల్మాన్ ఖాన్ చుట్టూ తిరుగుతుంది. ఆయన ఒక శక్తివంతమైన వ్యక్తి. ప్రజలు ఆయనను చాలా ప్రేమిస్తారు. సంజయ్ అందరికీ సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్న సంజయ్ భార్య సాయిశ్రీ పాత్రలో కనిపిస్తుంది. ఆమె తన భర్తను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇక ఇందులో సత్యరాజ్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించారు. విడుదలకు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో మాత్రం కమర్షియల్ హిట్ కాలేకపోయింది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు.
ఇక థియేటర్లలో డిజాస్టర్ అయిన ఈ సినిమా మే 25న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ దేశంలోని టాప్ 10 జాబితాలో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద రూ.103 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ.176 కోట్లు రాబట్టింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాత సాజిద్ నడియావాలా నిర్మించారు.
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..