
ఈమధ్యకాలంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. అలాగే ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా బయోపిక్ లు కూడా వస్తున్నాయి. వాస్తవానికి, సహజత్వానికి దగ్గరగా ఉండే ఈ సినిమాలు, సిరీస్ లు ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఓటీటీల్లో ఈ రియల్ స్టోరీలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక రియల్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్. గతంలో ‘ఎల వీజ పూంచిర’ అనే మలయాళం సూపర్ హిట్ సినిమాకు రచయితగా పనిచేసిన నిజమైన పోలీస్ అధికారి షాజీ మారడ్.. ఈ సినిమాకు స్టోరీ, డైలాగులు అందించారు. పోలీస్ శాఖలో నిజమైన విచారణ విధానాలు ఎలా ఉంటాయి? సిబ్బంది ఎలా ఉంటారు? ఉన్నతాధికారుల పనితీరు, కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి.. ఇలా ఎన్నో అంశలను ఈ సినిమాలో రియలిస్టిక్ గా చూపించారు. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. కేరళలోని కోజికోడ్ జిల్లా కొడువల్లి ప్రాంతంలో ఉన్న ఒక నిర్మానుష్యమైన పాడైపోయిన బావిలో ఒక మహిళ మృతదేహం లభ్యమవుతుంది. ఆ మృతదేహం ఎవరిది? హత్య చేశారా లేదా ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసు విచారణ ప్రారంభమవుతుంది. చివరకు ఈ మహిళ హత్య వెనక ఒక పెద్ద క్రైమ్ నెట్‌వర్క్ ఉందని పోలీసులు గుర్తిస్తారు? మరి చివరకు చివరకు హంతకుడు దొరికాడా లేదా అనేది మిగతా స్టోరీ.
యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ఉయిర్’. డైరెక్టర్ ఎమ్.పద్మకుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. రోషన్ మ్యాథ్యూ హీరో కాగా బైజు సంతోష్, అతుల్య చంద్ర, శ్రుతి మేనన్, సయామి ఖేర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఉయిర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 4వ తేదీ నుంచి ఉయిర్ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు జియో హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
The hunt for truth begins.
Uyir on JioHotstar from August 4.
Watch in Malayalam, Hindi, Tamil, Telugu & Kannada.@roshanmathew22 @Mpadmakumar1#Uyir #JioHotstar #JioHotstarMalayalam #Thriller #Drama #MalayalamMovie pic.twitter.com/THoXXPsMTq— JioHotstar Malayalam (@JioHotstarMal) July 25, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి