అటు థియేటర్స్.. ఇటు ఓటీటీలో సినిమాల జాతర మొదలైంది. గత శుక్రవారం ఈగల్, లాల్ సినిమాలు విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకున్నాయి. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు థియేటర్లలో భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ థ్రిల్లింగ్ సస్పెన్స్ మూవీస్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలోకి మరో హారర్ మూవీ రాబోతుంది. అదే ‘వళరి’. గురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రితికా సింగ్. ఇందులో వెంకీ సరసన నటించి మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో కనిపించింది. ఇక ఇప్పుడు హారర్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది. ఈ చిత్రానికి మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతోనే రైటర్ మ్రితికా దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. ఇందులో శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ఉత్తేజ్, సుబ్బరాజు, నవీన్ నాయుడు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఔట్ అంట్ ఔట్ హారర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో రితికా సింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే రితికా సింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అందులో రితికా సింగ్ వెనక దయ్యం రూపంలో మరో అమ్మాయి కనిపించడం సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది.
2018లో విడుదలైన నీవెవరో సినిమా తర్వాత రితికా మరో మూవీలో కనిపించలేదు..కానీ తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ వళరి సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాతోనే రితికా అటు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. వళరిని తమిళనాడు ప్రజలు ఆయుధంగా ఉపయోగిస్తుంటారు. 1800 దశకంలో బ్రిటీష్ ప్రభుత్వం ఈ ఆయుధాన్ని నిషేధించింది. ఆ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది.
Meet Divya 😍
She will treat you nice, and she is very kind. And what about the past behind?👹Let her story unfold… From March 6th exclusively on ETV Win!@ritika_offl #Srikanth @Actorsubbaraju #Uttej #MrithikaSanthoshini #PrincessSahasrav #PharrnithaRudraraju #TSvishnu… pic.twitter.com/wkjtbRqeHn
— ETV Win (@etvwin) February 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.