
బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ప్రస్తుతం ఆమె స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ తోనూ మెప్పిస్తోంది. అలా రష్మిక నటించిన లేటెస్ట్ లేడీ ఓరియంటెడ్ మూవీ’ ది గర్ల్ ఫ్రెండ్’. అందాల రాక్షసి సినిమాతో హీరోగా మెప్పించి, చిలసౌ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాను తెరకెక్కించడం విశేషం. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి రష్మికకు జోడీగా నటించాడు. నవంబర్ 07న థియేటర్లలో విడుదలైన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టింది. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కి రూ. 28 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది. టాక్సిక్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయిలు పర్సనల్‌గా.. ప్రొఫెషనల్‌గా ఎలా ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. దీంతో చాలా మంది అమ్మాయిలు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను ఓన్ చేసుకున్నారు.
థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రష్మిక సినిమా స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వెలువడింది. డిసెంబర్ 05 నుంచి ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. కాగా థియేట్రికల్ నెలరోజులు కాకముందే ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీలోకి వస్తుండడం విశేషం.
Meet Bhooma Devi, The Girlfriend MA Literature 🙂 ❤️ pic.twitter.com/3xV8SKkTf8
— Netflix India South (@Netflix_INSouth) November 30, 2025
ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్, రావు రమేశ్, రోహిణీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
రష్మిక సినిమా గురించి ఒక మహిళ మాటల్లో..
#TheGirlFriend is a film for all ages.
Everyone will have something to take away from this film ❤️Book your tickets for THE BEST TELUGU FILM OF THE YEAR now!
🎟️ https://t.co/aASxyrtyIG pic.twitter.com/XgwCB6pWgs— Geetha Arts (@GeethaArts) November 15, 2025