
ఓటీటీ ఆడియెన్స్ కు గుడ్ న్యూస్. మూవీ లవర్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తోన్న సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ థియేటర్లలో రిలీజై దాదాపు 50 రోజులు గడిచిపోయింది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోన్న ఈ మూవీని ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వీరి నిరీక్షణకు తెరపడనుంది. మరికొన్ని గంటల్లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ఇంతకీ మనం మాట్లాడుకునేది ఏ మూవీ గురించి అనుకుంటున్నారా?
రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన చిత్రం ‘ధురంధర్’. గతేడాది డిసెంబర్ 05న రిలీజైన ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లలో రిలీజై సుమారు 50 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఈ మూవీకి హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి.
ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 2025లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసిన ధురంధర్ ను ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వెలువడింది. ఇవాళ్టి (జనవరి 30) అర్ధరాత్రి నుంచే ధురంధర్ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉండనుంది. మొత్తం 3 గంటల 25 నిమిషాల సుదీర్ఘ రన్ టైమ్‌తో కూడిన అన్‌కట్ వెర్షన్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి..
TWITTER HAS CHANGED THE LIKE BUTTON BECAUSE #Dhurandhar is Officially Confirmed for Tonight.
Tap ❤️ to check#DhurandharOnNetflix pic.twitter.com/n8tIVf1XTu
— Gita (@Oye_Gita) January 29, 2026
#Dhurandhar is Officially Confirmed for Tonight.
Releases Midnight 12 am Jan 30.#DhurandharOnNetflix pic.twitter.com/nCWUnMPSdG— Aadi Sing (@Aadi01208) January 29, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి