Dhurandhar OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి ‘ధురంధర్’.. తెలుగులోనూ 1300 కోట్ల సినిమా.. ఎక్కడంటే?

2025లో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చేసిన సినిమా ‘ధురంధర్’. రణ్ వీర్ సింగ్ హీరోగా నటించి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి రానుంది.

Dhurandhar OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి ధురంధర్.. తెలుగులోనూ 1300 కోట్ల సినిమా.. ఎక్కడంటే?
Dhurandhar Movie

Updated on: Jan 21, 2026 | 10:01 PM

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’. గతేడాది డిసెంబర్ 05న రిలీజైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. రూ. 1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాల జాబితాల్లో ఒకటిగా నిలిచింది. ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన స్పై ఈ యాక్షన్ థ్రిల్లర్ లో అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 2025లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసిన ధురంధర్ ను ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ థియేటర్లలో రిలీజై సుమారు 45 రోజులకు పైగానే అయ్యింది. అలాగే ఇప్పటికీ నార్త్ లో చాలా చోట్ల ఈ మూవీ థియేటర్లలో రన్ అవుతోంది. దీంతో ధురంధర్ ఓటీటీ అంతకంతకూ ఆలస్యమవుతోంది. అయితే ఇప్పుడీ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స కొనుగులో చేసింది. ఇందుకోసం సినిమా నిర్మాతలకు భారీ మొత్తం చెల్లించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో జనవరి 30 నుంచి ధురంధర్ సినిమా స్ట్రీమింగ్ కానుందని సమాచారం. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుందని టాక్. కాందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంటు దాడి, 26/11 ముంబై దాడుల తర్వాత నిఘా సంస్థల కార్యకలాపాల కథ ఆధారంగా ధురంధర్ సినిమాను నిర్మించారు. ఇందులో రణ్‌వీర్ సింగ్ ‘రా’ ఏజెంట్ జస్కిరత్ సింగ్ రంగీగా నటించాడు. ఇక గ్యాంగ్ స్టర్ రెహ్మాన్ డకైట్ పాత్రలో అక్షయ్ ఖన్నా అదరగొట్టాడు.

ఇవి కూడా చదవండి

జనవరి 30 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు ఛాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి