Ramanna Youth OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న రామన్న యూత్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..

|

May 28, 2024 | 7:28 AM

పొలిటికల్ సెటైర్ కాన్సెప్ట్ తో పూర్తిగా తెలంగాణ బ్యాక్ డ్రాప్‏లో అభయ్ బేతిగంటి రూపొందించిన ఈ సినిమాలో అమూల్య రెడ్డి, తాగుబోతు రమేష్, శ్రీకాంత్ అయ్యంగార్, యూట్యూబర్ అనీల్ గీలా ప్రధాన పాత్రలు పోషించారు. పెళ్లి చూపులు సినిమా కంటే ముందు బొమ్మల రామారాం సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అభయ్.

Ramanna Youth OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న రామన్న యూత్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
Ramanna Youth
Follow us on

ఓటీటీలో సందడి చేసేందుకు మరో కామెడీ ఎంటర్టైనర్ సిద్ధమయ్యింది. గతేడాది సెప్టెంబర్ నెలలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఆ చిత్రం దాదాపు ఏడు నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. అదే రామన్న యూత్. పెద్ద స్టార్స్ లేరు.. టాప్ డైరెక్టర్ కాదు.. చిన్న సినిమాగా అడియన్స్ ముందుకు వచ్చి మంచి రివ్యూస్ అందుకుంది. పెళ్లి చూపులు మూవీ ఫేమ్ అభయ్ బేతిగంటి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా రామన్న యూత్. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో మే 30 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ అధికారికంగా ప్రకటిస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.

పొలిటికల్ సెటైర్ కాన్సెప్ట్ తో పూర్తిగా తెలంగాణ బ్యాక్ డ్రాప్‏లో అభయ్ బేతిగంటి రూపొందించిన ఈ సినిమాలో అమూల్య రెడ్డి, తాగుబోతు రమేష్, శ్రీకాంత్ అయ్యంగార్, యూట్యూబర్ అనీల్ గీలా ప్రధాన పాత్రలు పోషించారు. పెళ్లి చూపులు సినిమా కంటే ముందు బొమ్మల రామారాం సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అభయ్.. ఆ తర్వాత గీతా గోవిందం, సాహో, జార్జిరెడ్డి వంటి చిత్రాలతోపాటు పిట్టకథలు వంటి వెబ్ సిరీస్ చేశాడు.

కథ విషయానికి వస్తే..
రాజు (అభయ్ బేతిగంటి ) తన స్నేహితులతో కలిసి ఊరిలో జులాయిగా తిరుగుతుంటాడు. రాజకీయ నాయకుడు కావాలన్నది అతడి కల. కానీ ఓ మీటింగ్ లో రాజును అప్యాయంగా పలకరిస్తాడు సిద్ధిపేట ఎమ్మెల్యే రామన్న. ఎమ్మె్ల్యే మాటలతో రాజు పొంగిపోతాడు. దీంతో ఎమ్మెల్యేపై అభిమానంతో రామన్న యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తాడు. దసరా పండక్కి పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తాడు రాజు. ఆ ఫ్లెక్సీ రాజు జీవితంలో ఎలాంటి గందరగోళాన్ని సృష్టించింది ? అతడి జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి.. ? అనేది సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.