
రామ్ పోతినేని, భాగ్యశ్రీ భోర్సే హీరో, హీరోయిన్లుగా నటించిన లేటేస్ట్ సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ పి. మహేశ్ బాబు ఈ సినిమాను తెరకెక్కించాడు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. అలాగే రావు రమేష్, మురళీ శర్మ, రాజీవ్ కనకాలు, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. అందుకు తగ్గట్టుగానే నవంబర్ 27న థియేటర్లలో విడుదలై ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కథ, కథనాలు ఆసక్తికరంగా ఉండడం, రామ్ ఎనర్జిటిక్ యాక్టింగ్ అభిమానుకు బాగా నచ్చేశాయి. సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్ గా నిలిచాయి. అయితే ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్లు రాలేదు. ఈ మధ్యన డిసెంట్ టాక్ ఉండి కూడా ఓ మోస్తరు కలెక్షన్లు రాని సినిమా ఇదే కావడం గమనార్హం. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఆంధ్రా కింగ్ తాలుకా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైందని సమాచారం.
ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని క్రిస్మస్ స్పెషల్ కానుకగా డిసెంబర్ 25, 2025న ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది.
టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఆంధ్రా కింగ్ తాలుకా సినిమాలో చిత్రంలో హీరో అభిమాని పాత్రలో రామ్ అద్బుతంగా నటించాడు. అలాగే ఆంధ్రా కింగ్ సూర్య కుమార్ పాత్రలో ఉప్పీ కనిపించేది కొద్ది సేపే అయినా అభిమానులను బాగా ఆకట్టుకున్నాడు. ఇక భాగ్యశ్రీ అందచందాలు, పాటలు సినిమాలో హైలెట్ గా నిలిచాయి. ఓ మోస్తరు బడ్జెట్ తో తెరకెక్కిన ఆంధ్రా కింగ్ తాలుకా సినిమాకు సుమారు రూ. 30 కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. మరి థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
Needed some mid-week motivation? Here it is!#Chalu song lyrical video from #AndhraKingTaluka out now ❤🔥
▶️ https://t.co/8lorm8qeXYMusic by @iamviveksiva & @mervinjsolomon
Sung by @iamviveksiva & @vishaldadlani
Lyrics by @boselyricistBook your tickets for the BIOPIC OF… pic.twitter.com/RqGnrO4YRE
— Mythri Movie Makers (@MythriOfficial) December 10, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.