OTT Movie: క్రిస్మస్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలుకా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఆంధ్రా కింగ్ తాలుకా'. నవంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లు సాధించింది. క్రిస్మస్ కానుకగా ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: క్రిస్మస్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన రామ్ ఆంధ్రా కింగ్ తాలుకా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Andhra King Taluka Movie

Updated on: Dec 25, 2025 | 6:30 AM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ భోర్సే హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లాంటి డిఫరెంట్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ పి. మహేశ్ బాబు ఈ సినిమాను తెరకెక్కించాడు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఓ కీలక పాత్రలో నటించడంతో రిలీజ్ కు ముందే ఈమూవీపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కోసం హీరోరామ్ స్వయంగా పాటలు పాడడం, పెద్ద ఎత్తున ప్రమోషన్లు నిర్వహించడంతో పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే నవంబర్ 27న థియేటర్లలో విడుదలై ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కథ, కథనాలు ఆసక్తికరంగా ఉండడం, రామ్ ఎనర్జిటిక్ యాక్టింగ్, ఉపేంద్ర రోల్ అభిమానులకు బాగా నచ్చేశాయి. సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్ గా నిలిచాయి. అయితే ఈ మూవీకి ఆశించిన కలెక్షన్లు రాలేదు. ఈ మధ్యన డిసెంట్ టాక్ ఉండి కూడా కలెక్షన్లు రాని సినిమా ఇదే కావడం గమనార్హం. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఆంధ్రా కింగ్ తాలుకా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని క్రిస్మస్ స్పెషల్ కానుకగా డిసెంబర్ 25 న ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటన వెలువడింది. అందుకు తగ్గట్టుగానే గురువారం అర్ధరాత్రి నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

ఆంధ్రా కింగ్ తాలుకా సినిమాలో హీరో అభిమాని పాత్రలో రామ్ అద్బుతంగా నటించాడు. అలాగే ఆంధ్రా కింగ్ సూర్య కుమార్ పాత్రలో ఉప్పీ కనిపించేది కొద్ది సేపే అయినా ఆయన రోల్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇక భాగ్యశ్రీ అందచందాలు, పాటలు సినిమాలో హైలెట్ గా నిలిచాయి. ఓ మోస్తరు బడ్జెట్ తో తెరకెక్కిన ఆంధ్రా కింగ్ తాలుకా సినిమాకు సుమారు రూ. 30 కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.