
ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆడియెన్స్ కూడా వీటిని బాగానే చూస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో ఈ రియల్ స్టోరీలకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అలా తాజాగా మరో రియల్ స్టోరీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరుడు ఖుదీరామ్ బోస్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రాకేశ్ జాగర్లమూడి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. విద్యాసాగర్ రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. విజయ్ జాగర్ల మూడి నిర్మించారు . ప్రముఖ నటుడు బాలాదిత్య బఈ సినిమాకు రచన చేయగా, మణిశర్మ సంగీతం అందించారు.
దేశభక్తి ప్రధానంగా ఈ ఖుదీరామ్ బోస్ సినిమాను సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వ అధికారిక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేవ్స్‌లో ఈ బయోపిక్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని కోలీవుడ్ స్టార్ రజినీకాంత్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. డిసెంబర్ 3, 1889న జన్మించిన ఖుదీరామ్ బోస్ కేవలం 18 ఏళ్ల వయసులోనే దేశం కోసం తన ప్రాణాలర్పించాడు. స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఇప్పుడీ వీరుడి జీవిత కథ ఆధారంగానే ఈ బయోపిక్ తెరకెక్కింది.
Khudiram Bose is streaming on the Central Government’s Waves OTT. Wishing the team all the very best. pic.twitter.com/t6CAzvhPto
— Rajinikanth (@rajinikanth) December 5, 2025
కాగా ఖుదీరామ్ బోస్ సినిమాకు మొదటి నుంచి అండగా నిలుస్తున్నారు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఇక చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేశారు. సంగీత దర్శకుడిగా మణిశర్మ, ప్రొడక్షన్ డిజైనర్‌గా నేషనల్ అవార్డ్ విన్నర్ తోట తరణి, స్టంట్ డైరెక్టర్‌గా కనల్ కన్నన్, సినిమాటోగ్రాఫర్‌గా రసూల్ ఎల్లోర్, ఎడిటర్‌గా మార్తాండ్ కె.వెంకటేష్ వర్క్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి