Telugu movies: జులై చివరి వారంలో థియేటర్, ఓటీటీల్లో సందడి చేసేందుకు సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. వరుసగా మూవీస్ రిలీజ్ అవుతున్నా.. ప్రేక్షకుల అభిమానాలను అందుకోలేక చతికిల పడుతున్నాయి. అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో ఈ వారం అలరించేందుకు రెడీ అయిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
థియేటర్లలో..
రవితేజ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా రామారావు ఆన్ డ్యూటీ (Ramaroa on Duty) సినిమా ఈ వారం థియేటర్లో అలరించేందుకు రెడీ అయింది. జులై 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అరుళ్ శరవణన్, ఊర్వశి రౌటెల హీరోహీరోయిన్లుగా నటించిన ‘ద లెజెండ్’ (The legend) సినిమా జులై 28న థియేటర్లో విడులయ్యేందుకు సిద్ధమైంది. ఇక అదే రోజు సుదీప్, నిరుప్ భండారీ, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కలిసి నటించిన విక్రాంత్ రోణ (Vikrant Rona) రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది.
ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
1. రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్ (Rocketry) – అమెజాన్ ప్రైమ్ వీడియో – జులై 26న
2. గుడ్ లక్ జెర్రీ (Good Luck Jerry) – డిస్నీ+హాట్‌స్టార్ – జులై 29న
3. 777 చార్లీ (777 Charlie) – ఊట్- నెట్‌ఫ్లిక్స్ – జులై 29న
4. డ్రీమ్ హోమ్ మేకోవర్ – నెట్‌ఫ్లిక్స్ – జులై 27
5. ద మోస్ట్ హేటెడ్ మ్యాన్ ఆన్ ది ఇంటర్నెట్ – నెట్‌ఫ్లిక్స్ – జులై 27
6. కీప్ బ్రీతింగ్ – నెట్‌ఫ్లిక్స్ – జులై 28
7 మసాబా, మసాబా – నెట్‌ఫ్లిక్స్ – జులై 29
8. పర్పుల్ హార్ట్స్ – నెట్‌ఫ్లిక్స్ – జులై 29
9. పేపర్ రాకెట్ – జీ5 – జులై 29
10. రంగ్ బాజ్ – జీ5 – జులై 29
11. ద బ్యాట్‌మ్యాన్ – అమెజాన్‌ప్రైమ్ – జులై 27
12. బిగ్ మౌత్ – అమెజాన్‌ప్రైమ్ – జులై 29
13. షికారు – ఆహా – జులై 29
14. అదమస్ – డిస్నీ+హాట్‌స్టార్- జులై 27
15. 19 (1) (ఎ) – డిస్నీ+హాట్‌స్టార్- జులై 29
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..