టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్… సత్యదేవ్ ప్రధాన పాత్రలలో నటించిన లేటేస్ట్ చిత్రం స్కైలాబ్. డాక్టర్ రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ బ్యానర్లపై పృథ్వీ పిన్నమరాజు నిర్మించారు. ఈ చిత్రానికి విశ్వక్ కందెరావ్ దర్శకత్వం వహించారు. 1979లో జరిగిన స్కైలాబ్ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్కైలాబ్ స్పేస్ షటిల్ భూమ్మీద పడుతుందనే భయానికి ఆ కాలం నాటి ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారన్న విషయాలకు కామెడీని జోడించి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. డిసెంబర్ 4న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది.
తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు మేకర్స్. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. భారీ ధరకు స్కైలాబ్ సినిమాను సోని లివ ఓటీటీ వారు తెలుగులో స్ట్రీమింగ్ చేసేందుకు హక్కులు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 1979లో తెలంగాణలోని బండలింగంపల్లి గ్రామంలో జరిగిన సన్నివేశాలను ఇతివృత్తంగా చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
Whatever the problem is Dr.Anand has a perfect solution for you. Get ready to meet him on his clinic in Skylab, streaming on Jan 14 only on SonyLIV.#SkylabOnSonyLIV #ThetaleofBandalingampalli@MenenNithya @ActorSatyaDev @eyrahul @VishvakKhander1 @prashanthvihari @javvadiAditya pic.twitter.com/oS1bXvGNJS
— SonyLIV (@SonyLIV) January 11, 2022
Anupama Parameswaran : ఏంటమ్మా అనుపమ ఇంతపని చేశావ్.. బరువెక్కిన గుండెతో ఫ్యాన్స్ కామెంట్స్..