టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కమ్ రైటర్ వక్కంతం వంశీ తెరకెక్కించిన సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’. కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈమూవీలో శ్రీలీల కథానాయికగా నటించగా.. సీనియర్ హీరో రాజశేఖర్ కీలకపాత్ర పోషించారు. డిసెంబర్ 8న థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా పర్వాలేదనిపించుకుంది. ఈ సినిమాకు ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఇక అదే సమయంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న మూవీ సూపర్ హిట్ కావడంతో.. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’ చిత్రానికి అంతగా ఆదరణ లభించలేదు. అటు కలెక్షన్స్ సైతం అంతగా రాలేదు. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. కొన్ని రోజులుగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి సోషల్ మీడియాలో చర్చలు నడిచాయి. ఇక ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈనెల 19న స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ ప్లాట్ ఫాం సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. అయితే ఈసినిమాను తెలుగులోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మరిన్ని భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారో లేదో చూడాలి. థియేటర్లలో ఈ ఫన్ ఎంటర్టైనర్ మిస్ అయిన వారు.. ఇప్పుడు నేరుగా ఇంట్లోనే చూడొచ్చు.
శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో రావు రమేష్, పవిత్రా లోకేష్, బ్రహ్మాజీ, సుధేవ్ నాయర్, సంపత్ రాజ్, అజయ్ హర్షవర్దన్, హరి తేజ, రోహిణి తదితరులు నటించారు.
Get ready to experience all the shades of this extraordinary man ✨🫶🏽#ExtraOrdinaryManonHotstar Streaming from 19th Jan only on #DisneyPlusHotstar@actor_nithiin @ActorRajasekhar @sreeleela14 @vamsivakkantham@Jharrisjayaraj pic.twitter.com/HzL4Se8OEY
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) January 13, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.