Niharika Konidela: గత కొన్ని రోజులగా మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో ‘ఓసీఎఫ్‌ఎస్’ అనే హ్యాష్ ట్యాగ్‌ను పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ట్యాగ్ అర్థం ఏంటో చెప్పండి అంటూ నెటిజన్లను ప్రశ్నిస్తూ పోస్టులు చేసింది నిహారిక. ఇదిలా ఉంటే తాజాగా శుక్రవారం తండ్రి నగబాబు పుట్టిన రోజును పురస్కరించుకొని నిహారిక తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను అభిమానులతో పంచుకుంది. ఓసీఎఫ్‌ఎస్ అంటే ఏంటో తెలియజేస్తూ ఇన్‌స్టా్గ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేసింది.
వివాహం తర్వాత వెండి తెరకు దూరమైన నిహారిక ఇప్పుడు నిర్మాతగా బిజీగా మారేందుకు బిజీ అవుతోంది. ఈ క్రమంలోనే జీ5 ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్‌కు నిర్మాతగా మారింది నిహారిక. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌లో సంతోష్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితోపాటు టాలీవుడ్ సీనియర్ నటులు నరేశ్, తులసి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికొస్తే 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉంటాయి.
జీ5 ఓటీటీ వేదిక నుంచి ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ తొలి ఎపిసోడ్ ప్రీమియర్స్ నవంబరు 19న విడుదల కానుంది. ఇదిలా ఉంటే నాగబాబు పుట్టిన రోజును ఫ్యామిలీతో ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా భర్త చైతన్య, అన్న వరుణ్‌తేజ్‌తో పాటు తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసిన నిహారిక.. ‘కుటుంబ’ అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది.
Also Read: Supreme Court: బాణాసంచాపై సుప్రీంకోర్టు నిషేధం.. గ్రీన్ క్రాకర్స్ తయారీకి మాత్రమే అనుమతి..
Huzurabad By Election: హుజురాబాద్ పోలింగ్ రేపే.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల అధికారులు