
నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ సినిమా హనీ. గతంలో పలాస, శ్రీదేవి సోడా సెంటర్, మట్కా వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంలో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీలో దివ్య పిళ్లై, దివి వాద్త్యా, రాజా రవీంద్ర, బేబీ జయన్ని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 6న విడుదలైన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. . పిల్లి మాయ కాన్సెప్ట్ తో డార్క సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ మూవీని రూపొందించాడు కరుణ కుమార్. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండడంతో రీలీజ్ కు ముందే ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే థియేటర్లలో ఆడియెన్స్ ను ఓ మోస్తరుగా ఓ మోస్తరు గానే భయపెట్టింది. కథ, కథనాలు, బ్యాగ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్ ఎపిసోడ్ బాగానే ఉన్నాయని రివ్యూలు వచ్చాయి. అయితే మోతాదుకు మించిన వయొలెన్స్ కారణంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు దూరమయ్యారన్న కామెంట్స్ వినిపించాయి. థియేటర్లలో సినిమా లాంగ్ రన్ కాకపోవడానికి ఇదే కారణమని సినిమా నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఐఎండీబీలో ఈ మూవీకి మంచి రేటింగ్ రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇప్పుడీ హనీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (ఫిబ్రవరి 27) అర్ధరాత్రి నుంచే ఈ హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
అయితే హానీ సినిమా ఓటీటీ రిలీజ్ నేపథ్యంలో హీరో నవీన్ చంద్ర ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. సన్ నెక్ట్స్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ ఈ హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. అంటే ప్రస్తుతం ఈ మూవీ రెండు ఓటీటీల్లోనూ అందుబాటులో ఉందన్న మాట. ఓవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి సంయుక్తంగా ఈ హానీ మూవీని నిర్మించారు. థియేటర్లలో పెద్దగా ఆడని ఈ మూవీ ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. థియేటర్లలో ఆడని సినిమాలు, మరీ ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ మూవీస్ ఈ మధ్యన ఓటీటీలో ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. దీంతో హానీ మూవీ విషయంలోనూ ఇదే జరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నారు.
A performance that stings and stays
@naveenchandra212 @pillaidivya @actordivi @rajaraveendar @lavanyha05twins @pranidhiiii @nageshbanell @arasada.ajay @marthandkvenkatesh @ravipeetla @sekharmaster @karunakumar.1
@ovaoriginalsStreaming from 27 Feb in Tamil & Telugu — on Sun… pic.twitter.com/hkEBgnGfyD
— SUN NXT (@sunnxt) February 26, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.