Saripodhaa Sanivaaram OTT:అప్పుడే ఓటీటీలోకి నాని వంద కోట్ల సినిమా.. సరిపోదా శనివారం స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిపోదా శనివారం సినిమాకు మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నా నాని సినిమాకు మాత్రం వసూళ్లు తగ్గలేదు. ముఖ్యంగా సినిమాలో నాని - ఎస్ జే సూర్య మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఆడియెన్స్ ను బాగా అలరించాయి

Saripodhaa Sanivaaram OTT:అప్పుడే ఓటీటీలోకి నాని వంద కోట్ల సినిమా.. సరిపోదా శనివారం స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Saripodhaa Sanivaaram Movie

Updated on: Sep 16, 2024 | 9:54 AM

న్యాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఎస్ జే సూర్య విలన్ గా నటించాడు. గ్యాంగ్ లీడర్ తర్వాత మరో సారి హీరో నానితో జత కట్టింది ప్రియాంక అరుళ్ మోహన్. ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిపోదా శనివారం సినిమాకు మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నా నాని సినిమాకు మాత్రం వసూళ్లు తగ్గలేదు. ముఖ్యంగా సినిమాలో నాని – ఎస్ జే సూర్య మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఆడియెన్స్ ను బాగా అలరించాయి. ఇక బీజీఎమ్ కూడా సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లందని ప్రశంసలు వచ్చాయి. కాగా థియేటర్లలో రిలీజైన 18 రోజుల తర్వాత సరిపోదా శనివారం వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఈ ఘనత సాధించిన మూడో నాని సినిమా ఇదే. గతంలో ఈగ, దసరా సినిమాలు వంద కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టాయి. కాగా ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తోన్న సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్ పై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ నాని సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 27 నుంచే సరిపోదా శనివారం సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ డేట్ మారిందని సమాచారం. ఒకరోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 26 నుంచే సరిపోదా శనివారం స్ట్రీమింగ్ కు రానుందని టాక్ వినిపిస్తోంది.తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నాని సినిమా స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం.

అయితే సరిపోదా శనివారం ఓటీటీ రిలీజుపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని చెల్లించింది. అయితే థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత సినిమా ఓటీటీ లోకి రావాలని నిబంధనలు ఉన్నాయి. కానీ సరిపోదా శనివారం మూవీ విషయంలో మాత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాలకే స్ట్రీమింగ్ కి తీసుకొచ్చేలా డీల్ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ ఇదే జరిగితే మాత్రం అతి త్వరలోనే సరిపోదా శనివారం ఓటీటీలోకి రావొచ్చు.

ఇవి కూడా చదవండి

లెక్క ఇప్పుడు సరిపోయింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.