Nagendran’s Honeymoons OTT: ఐదుగురు భార్యలతో హనీమూన్.. ఓటీటీలోకి వస్తోన్న కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

|

May 25, 2024 | 7:48 AM

కానీ ఈసారి ప్రేక్షకులను అలరించేంది కామెడీ ఎంటర్టైనర్. ఈ సీరిస్ టైటిల్ నాగేంద్రన్స్ హానీమూన్స్. టైటిల్ కు తగినట్లే ఈ సిరీస్ కూడా విభిన్న కామెడీ ఎంటర్టైనర్. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్ ఫేమ్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడు సూరజ్ వెంజరమూడు, గ్రేస్ ఆంటోని, కనికుశ్రుతి, శ్వేత మీనన్, ఆల్ఫీ పంజికరన్, నిరంజన అనూప్ ప్రధాన పాత్రలు పోషించారు.

Nagendran’s Honeymoons OTT: ఐదుగురు భార్యలతో హనీమూన్.. ఓటీటీలోకి వస్తోన్న కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Nagendrans Honeymoons
Follow us on

కొన్నాళ్లుగా మలయాళం మూవీస్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలైనా.. చిన్న సినిమాలైనా ఘన విజయం సాధిస్తున్నాయి. ఇటీవల భ్రమయుగం సినిమా నుంచి మొన్నటి ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ చిత్రాల వరకు ప్రతి చిన్న మూవీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో మలయాళీ వెబ్ సిరీస్ అడియన్స్ ను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది. కానీ ఈసారి ప్రేక్షకులను అలరించేంది కామెడీ ఎంటర్టైనర్. ఈ సీరిస్ టైటిల్ నాగేంద్రన్స్ హానీమూన్స్. టైటిల్ కు తగినట్లే ఈ సిరీస్ కూడా విభిన్న కామెడీ ఎంటర్టైనర్. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్ ఫేమ్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడు సూరజ్ వెంజరమూడు, గ్రేస్ ఆంటోని, కనికుశ్రుతి, శ్వేత మీనన్, ఆల్ఫీ పంజికరన్, నిరంజన అనూప్ ప్రధాన పాత్రలు పోషించారు.

కసబా, కావల్ ఫేమ్ నితిన్ రెంజీ పనికర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ టైటిల్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. ఐదుగురు ఫీమేల్ లీడ్ యాక్టర్ మధ్యలో సూరజ్ వెంజరమూడు భయంభయంగా కూర్చొని కనిపిస్తున్నాడు. ఐదుగురు భార్యలున్న భర్త పాత్రలో సూరజ్ కనిపించనున్నాడు. భార్యలతో కలిసి భర్త హనీమూన్ ప్లాన్ చేయడానికి కారణం ఏంటీ…? అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు.. ? ఎలాంటి కష్టాలు పడ్డాడు ? ఐదుగురిని అసలు ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ? అని అంశాలతో ఈ సిరీస్ రూపొందించినట్లు తెలుస్తోంది.

ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ చేయడనున్నట్లు తెలిపారు మేకర్స్. జూన్ మొదటి వారంలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఈ సిరీస్ కు నితిన్ రెంజీ ఫణిక్కర్ దర్శకత్వం వహించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.