టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం నా సామిరంగ. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. యాక్షన్ ప్రియులతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించింది. క్లీన్ హిట్ గా నిలిచింది. ప్రముఖ కొరియో గ్రాఫర్ విజయ్ బిన్నీ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటించింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా, రుక్సాన్ థిల్లన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సంక్రాతి కానుకగా జనవరి 14న రిలీజైన నా సామిరంగ అంచనాలకు మించి కలెక్షన్లు రాణించింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఈ మూవీ బాగా మెప్పించింది. దీంతో నా సామిరంగ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో ఆడియెన్స్‌ను మెప్పించిన నా సామిరంగ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నాగ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఫిబ్రవరి 17 నుంచి నా సామిరంగ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకోస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘మరో వారం రోజుల్లో కింగ్ సినిమాను ఓటీటీలో చూడొచ్చు’ అంటూ ట్వీట్ చేసింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్.
‘నా సామిరంగ’ మూవీలో నాజర్, మలయాళ నటుడు షబ్బీర్ కలరక్కాల్, రవి వర్మ, రావు రమేశ్, మధు సూదన్ రావ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చాలా రోజుల తర్వాత ఆస్కార్ విజేత కీరవాణి నాగార్జున సినిమాకు స్వరాలు అందించడం విశేషం. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నా సామిరంగ సినిమాను నిర్మించారు. మరి థియేటర్లలో నా సామిరంగ సినిమాను మిస్ అయ్యారా? లేదా మరోసారి నాగార్జున మాస్ హంగామా చూడాలనుకుంటున్నారా? అయితే వారం రోజులు వెయిట్ చూడండి. ఎంచెక్కా ఓటీటీలోకి వస్తుంది.
Just one more week until we get to see the King 👑 #NaaSaamiRangaonHotstar Streaming from 17th Feb only on #DisneyPlusHotstar@iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial @RuksharDhillon @actorshabeer @srinivasaaoffl… pic.twitter.com/b32dwWbrIH
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 10, 2024
KomING to set your screens on fire 🙌
Can you guess the date?#NaaSaamiRangaonHotstar #KingOnHotstar@iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial @RuksharDhillon @actorshabeer @srinivasaaoffl @SS_Screens @boselyricist… pic.twitter.com/gsYHL1rPth
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 8, 2024
Only KING vibes!
Do you know who it is ?@iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial @RuksharDhillon @actorshabeer @srinivasaaoffl @SS_Screens @boselyricist @Dsivendra @ChotaKPrasad pic.twitter.com/kUmLh5foKD
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 7, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.