Thandel OTT: అప్పుడే ఓటీటీలోకి తండేల్! నాగ చైతన్య 100 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం తండేల్. చందూ మొండేటి తెరకెక్కించన ఈ ఎమోషనల్ ప్రేమ కథా చిత్రంలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 07న విడుదలైన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Thandel OTT: అప్పుడే ఓటీటీలోకి తండేల్! నాగ చైతన్య 100 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Thandel Movie

Updated on: Feb 20, 2025 | 9:17 AM

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. లవ్ స్టోరీ తర్వాత మరోసారి సాయి పల్లవితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు నాగ చైతన్య. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో బన్నీ వాసు, అల్లు అరవింద్ కలిసి తండేల్ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 07న విడుదలైన తండేల్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. . ఓవైపు సినిమా హెచ్ డీ వెర్షన్ లు ఆన్ లైన్ లో లీకయినా ఈ సినిమా వసూళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ మూవీగా తండేల్ నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా ప్రదర్శిస్తోన్న థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో కళకళ లాడుతున్నాయి. అయితే తాజాగా తండేల్ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాతనే ఓటీటీలోకి తీసుకొచ్చేలా డీల్ జరిగిందని సమాచారం.

ఈ నేపథ్యంలో మార్చి 06న లేదా 0 7న తండేల్ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే తండేల్ కు థియేటర్లలో మంచి కలెక్షన్లు వస్తుండడంతో ఓటీటీలోకి ఆలస్యంగా వస్తుందేమో నన్న మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

వంద కోట్లను దాటేసి..

మత్స్యకారుల జీవితాల్లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తండేల్ సినిమా తెరకెక్కింది. ఇందులో నాగ చైతన్య తండేల్ రాజు అనే మత్య్సకారుడి పాత్రలో అద్భుతంగా నటించాడు. ఇక సాయి పల్లవి నటనకు వంక పెట్టాల్సిన ఛాన్సే లేదు. వీరితో పాటు కరుణాకరణ్, ప్రకాశ్ బెలావాడి, దివ్య పిళ్లై, పృథ్వీ, కళ్యాణీ నటరాజన్, కల్పలత తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.