
లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి మరోసారి జంటగా నటించిన చిత్రం తండేల్. మత్స్యకారుల జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటన ఆధారంగా చందూ మొండేటి ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని తెరకెక్కించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో బన్నీ వాసు, అల్లు అరవింద్ కలిసి తండేల్ సినిమాను నిర్మించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 07న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. నాగ చైతన్య, సాయి పల్లవిల సూపర్బ్ యాక్టింగ్, దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. రిలీజైన కొద్ది రోజులకే సినిమా హెచ్ డీ పైరసీ వెర్షన్లు ఆన్ లైన్ లో లీకయినా ఈ సినిమా వసూళ్లు ఏ మాత్రం తగ్గలేదు. ఓవరాల్ గా తండేల్ సినిమా రూ.100 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర బృందమే అధికారికంగా ప్రకటించింది. కాగా నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన తండేల్ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇటీవలే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన కూడా వెలువరించింది. మార్చి 07 నుంచి నాగ చైతన్య సినిమాను తమ ఓటీటీలో స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. అంటే ఇవాళ్టి అర్ధ రాత్రి నుంచే తండేల్ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుందన్న మాట.
ఈ సినిమాలో నాగ చైతన్య తండేల్ రాజు అనే పాత్రలో అదరగొట్టాడు. ఇక సాయి పల్లవి నటనకు వంక పెట్టాల్సిన ఛాన్సే లేదు. ఇందులో ఆమె నాగ చైతన్య ప్రేయసి బుజ్జితల్లిగా యాక్ట్ చేసింది. వీరితో పాటు కరుణాకరణ్, ప్రకాశ్ బెలావాడి, దివ్య పిళ్లై, పృథ్వీ, కళ్యాణీ నటరాజన్, కల్పలత తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
Pramadham ani thelisina, thana mandhi kosam mundhadugu vesevaadey Thandel 😎
Watch Thandel, out 7 March on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi!#ThandelOnNetflix pic.twitter.com/RbS445ZBJj— Netflix India South (@Netflix_INSouth) March 4, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.