OTT Movie: 3 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్
గత వారమే ఈ తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జానర్ గా రూపొందన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. ఎక్కడా బోర్ కొట్టకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగుతూ ఆడియెన్స్ ను కట్టిపడేస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్స్, క్రైమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ మూవీని అసలు మిస్ చేయద్దు.

ఎప్పటిలాగే ఈ వారం ఓటీటీల్లోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. తెలుగుతో పాటు హిందీ, కన్నడం, తమిళం, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఆడియెన్స్ కు వినోదం పంచనున్నాయి. విజయ్ సేతుపతి అవార్డ్ విన్నింగ్ మూవీ ‘బత్తా’, అవరచన్ & బాయ్స్, ఇమ్మోర్టల్ లాంటి సినిమాలతో పాటు కీర్తి సురేష్ అక్క, రుద్రవనం పీఎస్ వంటి వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం అందించనున్నాయి. అయితే వీటికంటే ముందు గత వారం ఓటీటీలోకి వచ్చిన ఒక సినిమా ఆడియెన్స్ ను కట్టిపడేస్తోంది. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఆద్యంతం థ్రిల్లింగ్ గా సాగే ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే 50 మిలియన్ల స్ట్రీమింగ్ వ్యూస్ ను అధిగమించింది. వివరాల్లోకి వెళితే.. ఈ మధ్యన చిన్న సినిమాలకు థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువగా ఆదరణ దక్కుతోంది. ఈ కారణంతోనే ఈ సినిమాను డైరెక్టుగా ఓటీటీలోకి రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు వారి నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో రికార్డులు కొల్లగొడుతోంది. మౌత్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ అవ్వడంతో కేవలం మూడు రోజుల్లోనే ఈ మూవీ 50 మిలియన్ల వ్యూస్ మార్క్ ను అధిగమించించింది.
ఈ సినిమా స్టోరీ విషయానికి మొదటి నుంచే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న స్వప్న.. ఫస్ట్ నైట్ రోజే తను వర్జిన్ కాదు అని భర్త బాలుతో చెబుతుంది. ఒకవైపు భర్తతో ఉంటూనే, పెళ్లికి ముందు ప్రేమించిన అబాన్ అనే యువకుడితో ఎఫైర్ కొనసాగిస్తుంది. ఇదంతా కనిపెట్టిన బాలు ఓ రోజు వాళ్లిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. అయితే ఆ తర్వాత స్వప్న అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోతుంది. దీంతో నేరుగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతాడు బాలు. అసలు స్వప్న ఏమైపోయింది? దీని వెనక ఎవరున్నారు? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఆహాలో ‘నా వైఫ్ మిస్సింగ్’ మూవీ సంచలనం
50 MILLION+ STREAMING MINUTES! ❤️🔥 The mystery is a HIT, and the audience can’t get enough! 🔍
Watch #nawifemissingonaha now! https://t.co/jLunxFkGm9
— ahavideoin (@ahavideoIN) October 26, 2026
ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు ‘నా వైఫ్ మిస్సింగ్’. ‘కొత్త బంగారు లోకం’ సినిమా ఫేమ్ వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ ఈ సినిమాలో జంటగా నటించారు. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీకి బ్లాక్ మ్యాజిక్ (క్షుద్ర పూజలు) యాంగిల్ జోడించి దర్శకురాలు స్వాతి ప్రకాష్ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రవీణ్, జబర్దస్త్ సత్యశ్రీ కామెడీ, సాయి కార్తీక్ అందించిన ఇంటెన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లాయి. పైగా ఎలాంటి లాగ్ లేకుండా చాలా క్రిస్ప్ రన్ టైమ్ తో ఈ సినిమా సాగుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్, క్రైమ్ డ్రామాలు ఇష్టపడేవారికి ఈ మూవీ ది బెస్ట్ అని చెప్పవచ్చు.
‘నా వైఫ్ మిస్సింగ్’ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




