AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horror Movie : చూస్తే గుండె ప్యాంట్‌లోకి జారాల్సిందే.. ఓటీటీలోకి వచ్చేసిన హారర్ మూవీ.!

ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ప్రేక్షకులను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ కావడంతో ఓటీటీల్లో సినిమాలు చేస్తూ ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఓటీటీల్లో సినిమాలు కూడా భారీగా విడుదలవుతున్నాయి. రకరకాల జోనర్స్ ఓటీటీల్లో విడుదలై అలరిస్తున్నాయి. శుక్రవారం వచ్చిందంటే చాలు పదుల సంఖ్యలో విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

Horror Movie : చూస్తే గుండె ప్యాంట్‌లోకి జారాల్సిందే.. ఓటీటీలోకి వచ్చేసిన హారర్ మూవీ.!
Ott Movie
Rajeev Rayala
|

Updated on: May 08, 2026 | 2:32 PM

Share

ఈ సమ్మర్ కు పెద్దగా కొత్త సినిమాల హడావిడి కనిపించడం లేదు. ఈ రోజు ( శుక్రవారం ) రెండు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో ఒకటి గోదారి గట్టుమీద, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన సతీలీలావతి, రవిబాబు నటించిన రేజర్ సినిమాలు థియేటర్స్ లోకి అడుగుపెట్టాయి. వీటితో పాటు హరుడు, విధి గీసిన విచిత్రం, ఏ ఫిల్మ్ బై గిరి లాంటి సినిమాలు థియేటర్స్ లో విడుదలై ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈవారం మాస్ మహారాజ రవితేజ నటించిన కృష్ణ సినిమా రీ రిలీజ్ కానుంది, దానితో పాటి నాని నటించిన నిన్నుకోరి, శింబు వల్లభ సినిమాలు రి రిలీజ్ కానున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో అలరిస్తుంటే కొన్ని కొత్త సినిమాలు ఓటీటీల్లో విడుదలై అలరిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ హారర్ సినిమా ప్రేక్షకులను వణికిస్తోంది.

ఇది కూడా చదవండి : బీటెక్ మధ్యలో వదిలేసింది.. రూ. 500తో వచ్చి రూ.100కోట్ల ఆస్తుపాస్తులు సంపాదించింది

వామ్మో ఈ సినిమా ఒక్కసారి చూడటం మొదలుపెడితే అస్సలు ఆపలేరు. సీన్ సీన్ కు వెన్నులో వణుకుపుట్టిస్తుంది ఈ సినిమా.. ఈ రోజే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ హారర్ సినిమా మార్చ్ 27న థియేటర్స్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా క్షుద్ర పూజల నేపథ్యంలో తెరకెక్కింది. క్షుద్ర పూజ చేసే క్రమంలో అది బెడిసికొట్టడంతో ఓ దుష్టశక్తి బయటకు వస్తుంది. ఆ దుష్టశక్తి ఓ బిడ్డ పాలిట శాపంగా మారుతుంది. ఆ బిడ్డను కాపాడుకోవడానికి తల్లి చేసే పోరాటం ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి :OTT Movie : హైవేపై వరుసగా ప్రమాదాలు.. కట్ చేస్తే ట్విస్ట్.. ఓటీటీని షేక్ చేస్తున్న థ్రిల్లర్..

ఈ సినిమా సతన్ అంటే సైతాన్ అని అర్ధం.. మణికందన్ రామలింగం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమా రెండు వేరు వేరు టెమ్ లైన్స్ లో జరుగుతుంది. ఇక ఈ సినిమాలో ఎఫ్.జె (FJ), అయిరా పాలక్, చాందిని తమిళరసన్, మోనా బెడ్రే, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో మే 8న సతన్ ది డార్క్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ హారర్ మూవీని అస్సలు మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : బికినీ వేసుకోమని ఫోర్స్ చేశాడు.. 19ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us