OTT Movie: వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ చూడొచ్చు.. IMDB టాప్ రేటింగ్ మూవీ

ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా తెలుగు వెర్షన్ ను కూడా స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. మంచి హారర్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారికి ఇది ఒక మంచి సినిమా అని చెప్పవచ్చు.

OTT Movie: వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ చూడొచ్చు.. IMDB టాప్ రేటింగ్ మూవీ
OTT Movie

Updated on: Nov 09, 2025 | 4:54 PM

గత వారం ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో ఒక హారర్ థ్రిల్లర్ సినిమా కూడా ఉంది. ఇదొక మరాఠి సినిమా. ఈ ఏడాది జూన్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చేతబడి, బాణామతి నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఆడియెన్స్ ను బాగా భయపెట్టింది. అలాగే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. తర్వాత ఆగస్ట్ 8న హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. అప్పుడు కూడా ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. అయితే అప్పుడు కేవలం హిందీ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ కు రాగా, ఇప్పుడు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. మధ్యలో వచ్చే ట్విస్టులు ఆడియెన్స్ ను థ్రిల్ కు గురి చేస్తాయి. రాధ(అమృత సుభాష్)కు భర్త, కుమార్తె ఉంటారు. అయితే ఆమె ఇంట్లో ఏమాత్రం ప్రశాంతత ఉండదు. సంతోషం లేకుండా బిక్కబిక్కుమంటూ జీవిస్తుంటుంది. రాధ భర్త, కుమార్తె కూడా తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. దానికి కారణం చేతబడి. రాధ కుటుంబాన్ని ఎవరో చేతబడి చేస్తారు. ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి రాధ.. ఈ సమస్యతో బాధపడుతూ ఉంటుంది. అసలు రాధకు ఎవరు ఇలా చేతబడి చేశారు? ఆమె కుటుంబంపై ఎవరికి పగ, శత్రుత్వం ఉంది? ఎందుకు ఉంది? చివరకు ఏమైందన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, అద్దిరిపోయే ట్విస్టులతో సాగి పోయే సినిమా పేరు జారన్. అంటే తెలుగులో చేతబడి అని అర్థం. ఈ సినిమాలో సేక్రెడ్ గేమ్ సిరీస్ ఫేమ్ హిందీ నటి, అమృత సుభాష్, అనితా కేల్కర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సోనాలీ కులకర్ణి టైటిల్ రోల్ జారన్‌గా నటించింది. మూఢనమ్మకాల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాకు ఐఎమ్డీబీలోనూ 7.1/10 రేటింగ్ దక్కడం విశేషం. వీకెండ్ లో మంచి హారర్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారికి జారన్ ఒక మంచి ఛాయిస్.

తెలుగులోనూ జారన్ సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి