OTT Movie: మనుషుల మాంసంతో కూరలు వండే మహిళ.. చాలా దేశాల్లో బ్యాన్ అయిన కాంట్రవర్సీ మూవీ.. ఇప్పుడు ఓటీటీలో

కంటెంట్ పరంగా ఈ సినిమా చాలా వివాదాలు ఎదుర్కొంది. ఈ సినిమాలో హింసాత్మక సన్నివేశాలు, రక్తపాతం ఓ రేంజ్ లో ఉంటాయి. అందుకే ఈ కాంట్రవర్సీ సినిమాను రిలీజ్ చేయకుండా చాలా దేశాల్లో నిషేధం కూడా విధించారు. అయితే ఆన్ లైన్ లో మాత్రం..

OTT Movie: మనుషుల మాంసంతో కూరలు వండే మహిళ.. చాలా దేశాల్లో బ్యాన్ అయిన కాంట్రవర్సీ మూవీ.. ఇప్పుడు ఓటీటీలో
Claypot Curry Killers Movie

Updated on: Nov 28, 2025 | 6:58 PM

కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు మరీ దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లకు సెన్సార్ లేకపోవడంతో యథేచ్ఛగా శృంగార, హింసాత్మక సన్నివేశాలను జోడిస్తున్నారు. ఒక్కోసారి సినిమాలోని కంటెంట్ కూడా వివాదాస్పదమవుతుంటుంది. ఎంతలా అంటే సినిమాను రిలీజ్ చేయకుండా బ్యాన్ చేసేలా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సేమ్ టు సేమ్ అలాంటిదే. కంటెంట్ పరంగా ఈ సినిమా చాలా వివాదాల ఎదుర్కొంది. అయితే సెన్సార్ కట్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే… మిసెస్ చూ అనే మహిళ చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. ఆమె తన ముగ్గురు కూతుర్లతో కలిసి ఒక చిన్న రెస్టారెంట్ నడుపుతుంటుంది. వాళ్ల స్పెషల్ ఐటెమ్ ‘క్లేపాట్ కర్రీ’. అంటే మట్టి పాత్రలో ఆవిరి తో చేసే హోమ్‌మేడ్ కర్రీ అన్న మాట. వీరి రెస్టారెంట్ మామూలుగానే నడుస్తుంది. అయితే ఒకరోజు చూ భర్త పిల్లల తో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో తల్లీ కూతుర్లు అతన్ని చంపేస్తారు. అతని శవాన్ని ఏం చేయాలో తెలియక ముక్కలు ముక్కలుగా నరికి కూర వండి తమ రెస్టారెంట్లకు వచ్చే కస్టమర్లకు పెడతారు. ఆ కర్రీ టేస్ట్ కూడా గొప్పగా ఉండటంతో రెస్టారెంట్ ఉన్నట్లుండి రద్దీగా మారుతుంది. వచ్చే వాళ్లందరూ మనిషి మాంసంతో చేసిన ‘క్లేపాట్ కర్రీ’ నే కావాలంటారు. దీంతోమిసెస్ చూతో ఆమె కూతుళ్లు రోజు రాత్రిపూట మనుషులను ట్రాప్ చేసి చంపి కూర వండటం మొదలు పెడతారు.

రాత్రి నైట్ క్లబ్‌లకు వెళ్లి మగవాళ్లను ముగ్గులోకి దింపడం, ఇంటికి తెచ్చి డ్రగ్స్ ఇచ్చి చంపేస్తుంటారు మిసెస్ చూ కూతుళ్లు, ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసి కర్రీలో కలిపేస్తుంటారు. దీంతో మిసెస్ చూ రెస్టారెంట్ బాగా ఫేమస్ అవుతుంది. ఇదే క్రమంలో పక్క రెస్టారెంట్ ఓనర్స్ జెలసీతో రివెంజ్ ప్లాన్ వేస్తాడు. ఫేమస్ మాస్టర్ చెఫ్ ను పంపి చూ రెసిపీ చేయాలని ఆర్డర్ ఇస్తాడు. అతను రెస్టారెంట్‌కి రావడంతో మిసెస్ చూ కూతుర్లు మాత్రం ఏమీ మాట్లాడకుండా, వాళ్లని కూడా చంపేసి కర్రీలో వండేస్తారు. మరి మిసెస్ చూ ఆమె కూతుళ్ల ఆగడాలు ఎలా ఆగాయా? పోలీసులు వీరిని పట్టుకున్నారా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

అత్యంత హింసాత్మక సన్నివేశాలతో సాగే ఈ సినిమా పేరు‘క్లేపాట్ కర్రీ కిల్లర్స్’ (Claypot Curry Killers). ఇదొక మలేషియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సుమారు 93 నిమిషాల నిడివి ఉన్న ఈ  సినిమా మలేషియాలో టాప్ హారర్‌ సినిమాగా ఫేమస్ అయింది. ఈ సినిమా ఏ ఓటీటీలోనూ లేదు. ఇప్పుడు కేవలం Filmdoo వెబ్ సైట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ముందే చెప్పాం కాదా? ఈ సినిమాను పిల్లలతో కలిసి చూడకపోవడం చాలా బెటర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.