Annapoorani: నయనతార సినిమాకు షాక్.. ఓటీటీ నుంచి ‘అన్నపూరణి’ మూవీ తొలగింపు.. కారణం ఇదే..

కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయన్. ఇటీవలే అన్నపూరణి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తోపాటు విమర్శలను ఎదుర్కొంది. అన్నపూరణి ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమాకు విడుదలకు ముందు నుంచే వివాదాలు చుట్టుముట్టాయి. థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

Annapoorani: నయనతార సినిమాకు షాక్.. ఓటీటీ నుంచి  అన్నపూరణి మూవీ తొలగింపు.. కారణం ఇదే..
Annapoorani Movie

Updated on: Jan 11, 2024 | 2:58 PM

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‏గా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ నయనతార. దక్షిణాది ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ జోడిగా జవాన్ సినిమాతో అలరించింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో అటు బీటౌన్ లోనూ నయన్ కు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయన్. ఇటీవలే అన్నపూరణి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తోపాటు విమర్శలను ఎదుర్కొంది. అన్నపూరణి ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమాకు విడుదలకు ముందు నుంచే వివాదాలు చుట్టుముట్టాయి. థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో కన్నడ, తమిళ్, తెలుగు, హిందీ మలయాళం భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో నెట్ ప్లిక్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా లవ్ జిహాద్ ను ప్రోత్సహించేలా ఉందని.. నిర్మాతలతోపాటు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను ఆశ్రయించాడు మాజీ శివసేన లీడర్ రమేశ్ సోలంకి. అలాగే ఈ మూవీ నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను అభ్యర్థించారు. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ విశ్వహిందూ పరిషత్ నాయకుడు శ్రీరాజ్ నాయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ చిత్రాన్ని నిర్మించిన జీ స్టూడియోస్ విశ్వ హిందూ పరిషత్ కు క్షమాపణలు చెబుతూ ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ నుంచి తొలగించింది.

సినిమా కథ విషయానికి వస్తే..

తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ (అచ్యుత్ కుమార్) చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి (నయనతార)కు చెఫ్ కావాలని కోరిక ఉంటుంది. బ్రహ్మాణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి నాన్ వెజ్ ముట్టుకోవడం అని అంటారు. అన్నపూరణి చెఫ్ అయ్యిందా ?. ఎలాంటి సవాళ్లను, పరిస్థితులను ఎదుర్కోంది అనేది ఈ సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.