ఈ ఏడాది సంక్రాంతి పండక్కి విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా ‘గుంటూరు కారం’. ప్రీమియర్ షోలతో ముందుగా మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా.. ఆ తర్వాత మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. అల వైకుంఠపురంలో తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గత నెల జనవరి 12న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జయరామ్ కీలకపాత్రలలో నటించారు. అమ్మ సెంటిమెంట్.. అందుకు కాస్త మాస్ యాక్షన్ టచ్ ఇచ్చారు త్రివిక్రమ్. అయితే ముందుగా ఈ సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత భారీ వసూళ్లు రాబట్టింది. సంక్రాంతి బరిలో విడుదలైన ఈ రీజనల్ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని పలు చోట్ల బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమాలోని పాటల గురించి చెప్పక్కర్లేదు. తమన్ అందించిన మ్యూజిక్ శ్రోతలను ఆకట్టుకుంది. ఈ మూవీలోని ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తి ఎదురుచూశారు. ఇక ఇప్పుడు ప్రేక్షకులకు ఎదురుచూపులకు తెర పడింది. మొత్తానికి గుంటూరు కారం సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గత అర్దరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ఈ మూవీ అందుబాటులో ఉంది.
అయితే థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో ఎంతమేరకు మెప్పిస్తుందో చూడాలి. త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వచ్చిన మూడవ చిత్రం ఇదే. ప్రస్తుతం మహేష్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. ఈ సినిమా కోసం ఇటీవలే జర్మనీ అడవులలో ట్రైనింగ్ తీసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చారు సూపర్ స్టార్.
Ramanagadu is a celebration! ❤️❤️
We all adored him on the big screen creating a record-breaking sensation at the box office 🔥🔥Now, he’s here to entertain us in our homes 😀#GunturKaaramOnNetflix 💥@NetflixIndia #GunturKaaram
Super 🌟 @urstrulyMahesh #Trivikram… pic.twitter.com/O8x7Cm2rmo
— Guntur Kaaram (@GunturKaaram) February 8, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.