సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సర్కారు వారి పాట విజయం తర్వాత ఆయన డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు సూపర్ హిట్ అందుకున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్.. ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుంది. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ సర్కి్ల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంక్రాంతి రోజే ప్రకటించింది.
ఈ సినిమా ఓటీటీ హక్కులను రూ. 80 కోట్లకు సొంతం చేసుకుందంటున్నారు. మహేష్ బాబుతోపాటు.. దర్శకుడు త్రివిక్రమ్ కు కూడా ఇది తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ చిత్రానికి భారీగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం రాలేదు. కానీ ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ న్యూస్ మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది.
అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ అప్డేట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు.ఈ మూవీ తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ చేయనున్నారు.