Mad Square OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి మ్యాడ్ స్క్వేర్.. సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ఓటీటీ ఆడియెన్స్ కు గుడ్ న్యూస్.. లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ మ్యాడ్ స్క్వేర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన విడుదలైంది. కాబట్టి ఇంటిల్లిపాది నవ్వుకోవడానికి రెడీగా ఉండండి.

Mad Square OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి మ్యాడ్ స్క్వేర్.. సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Mad Square Movie

Updated on: Apr 25, 2025 | 9:19 AM

సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మ్యాడ్ స్క్వేర్. గతంలో చిన్న సినిమాగా రిలీజై సంచలనం సృష్టించిన మ్యాడ్ సినిమాకు ఇది సీక్వెల్. మొదటి పార్ట్ ను తెరకెక్కించిన కళ్యాణ్ శంకరే సీక్వెల్ కు కూడా దర్శకత్వం వహించారు. ఉగాది పండగ కానుకగా మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి భాగానికి మించి థియేటర్లలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ట్రేడ్ నిపుణుల ప్రకారం మ్యాడ్ స్క్వేర్ సినిమా రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను ఓటీటీలో చూద్దామని చాలా మంది ఎదురు చూస్తున్నారు. త్వరలోనే వీరి నిరీక్షణకు తెరపడనుంది. మ్యాడ్ స్క్వేర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై కీలక అప్ డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 25 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది . ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా  ఒక నెట్ ఫ్లిక్స్ ఒక పోస్ట్ పెట్టింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ మ్యాడ్ స్క్వేర్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కాగా థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఈ సినిమా ఓటీటీలోకి రావడం గమనార్హం.

నెలలోపే ఓటీటీలోకి

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన  మ్యాడ్ స్క్వేర్ సినిమాలో ప్రియాంక జువాల్కర్ మరో కీలక పాత్ర పోషించింది.  అలాగే సునీల్, విష్ణు, శుభలేఖ సుధాకర్‌, మురళీధర్‌ గౌడ్‌, తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా,  తమన్‌ బీజీఎమ్ సమకూర్చారు. మరి థియేటర్లలో ఈ కామెడీ ఎంటర్ టైనర్ ను మిస్ అయ్యారా? అయితే మరో మూడు రోజులు ఆగండి. ఎంచెక్కా ఇంట్లోనే చూసి కడుపుబ్బా నవ్వుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరో నాలుగు రోజుల్లో స్ట్రీమింగ్ కు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.