Maa Oori Polimera 2: ఇట్స్ అఫీషియల్.. పొలిమేర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ చూడొచ్చంటే

|

Dec 01, 2023 | 8:49 PM

సత్యం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న రాజేష్ హీరోగా నటించిన పొలిమేర సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సత్యం రాజేష్, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. మూఢనమ్మకాలు, చేతబడులు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఆతర్వాత ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది.

Maa Oori Polimera 2: ఇట్స్ అఫీషియల్.. పొలిమేర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ చూడొచ్చంటే
Polimera 2
Follow us on

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాంటి సినిమాల్లో మా ఊరి పొలిమేర సినిమా ఒకటి. సత్యం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న రాజేష్ హీరోగా నటించిన పొలిమేర సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సత్యం రాజేష్, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. మూఢనమ్మకాలు, చేతబడులు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఆతర్వాత ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఓటీటీలో ఈ సినిమాకు మంచి వ్యూస్ వచ్చాయి.

అదిరిపోయే ట్విస్ట్ తో పొలిమేర 1 ను ఎండ్ చేశారు. దాంతో పొలిమేర 2 పై అంచనాలు పెరిగిపోయాయి. మా ఊరి పొలిమేర 2 సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అవ్వడంతో ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. పొలిమేర 1 కంటే పొలిమేర 2లో మరిన్ని ట్విస్ట్ లు పెట్టారు.

ఇక థియేటర్స్ లో పొలిమేర 2 సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకుంది. అయితే భారీ అంచనాలు ఏర్పడటంతో ఈ సినిమా పై మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రానుంది. తాజాగా పొలిమేర సినిమా ఓటీటీ రిలీజ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో పొలిమేర సినిమా స్ట్రీమింగ్ కానుంది. పొలిమేర 2  ఓటీటీ రైట్స్ ను ఆహా సొంతం చేసింది. దాంతో ఆహ పొలిమేర సినిమాను డిసెంబర్ 8న స్ట్రీమింగ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.