కరోనా సంక్షోభంతో ఓటీటీలకు ఎక్కువగా ఆదరణ లభించింది. ఓవైపు లాక్ డౌన్.. మరోవైపు థియేటర్లు చాలా రోజులు మూతపడడంతో ఓటీటీ బాట పట్టారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే వినోదాత్మక సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లతో అన్ని భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తూ జీ`5 . ఓటీటీ అంటే వినోదం మాత్రమే కాదు, అంతకు మించి అన్నట్లు దూసుకు పోతోంది. స్పోర్ట్స్ డ్రామా జానర్‌లో రూపొందిన ఒరిజినల్ సిరీస్ ‘లూజర్’తో వీక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ సిరీస్ ‘లూజర్ 1 ఏంతో ప్రేక్షాదరణ పొందిన విషయం తెలిసిందే. ఆ హిట్ సిరీస్ కు సీక్వెల్ గా ”లూజర్ 2’ ను తీసుకువస్తోంది.
తొలి సీజన్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ‘లూజర్ 2’కు అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించారు. దీనికి అభిలాష్ రెడ్డి క్రియేటర్. జీ5, అన్నపూర్ణ స్టూడియోస్, స్పెక్ట్రమ్ మీడియా నెట్‌వర్క్క్ నిర్మించిన ఈ సిరీస్ జీ`5 ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని, దూసుకుపోతున్న సందర్భంగా ఈ ఆనందాన్ని పంచుకోవటానికి హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్ లో ‘లూజర్ 2′ ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కింగ్ అక్కినేని నాగార్జున,అక్కినేని అమల,బ్యాట్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్, జీ 5 హెడ్స్ తదితరులు పాల్గొని ఏంతో ప్రేక్షాదరణ పొందిన ”లూజర్ 1″ సక్సెస్ తర్వాత ఈ నెల 21 న జీ 5 లో “లూజర్ 2’ గా ప్రేక్షకుల మన్ననలు పొందడానికి వస్తున్న టీం అందరికీ అల్ ధ బెస్ట్ తెలియజేశారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ఓటిటి అనేది న్యూ రెవల్యూషన్. సినిమా అనేది ఆడియన్స్ ను రెండున్నర గంటల పాటు థియేటర్లో కూర్చోబెట్టి మెప్పిస్తూ ఎంటర్టైన్మెంట్ అయ్యేలా చెయ్యాలి. అయితే ఓటిటి వచ్చిన తరువాత ఎంటర్టైన్మెంట్ అనేది ఫోన్ లోకి వచ్చేస్తుంది. అయితే ఓటిటిలో సినిమా తీయాలంటే అంత ఈజీ కాదు సినిమా లాగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలగాలి. అలాంటిది లూజర్ వెబ్ సిరీస్ ఆడియన్స్ ని థ్రిల్ కలిగించేలా అద్భుతంగా తీశారు. “లూజర్ 2” ట్రైలర్ చూశాను. ట్రైలర్ లోనే ఇందులో ఉన్న కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. అక్కడే వీరు సక్సెస్ అయినట్టు. ఏ సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా టీం ఇన్వాల్వ్ అయినప్పుడే సక్సెస్ అవుతుంది. ఈ నెల 21 న “లూజర్ 2” జీ 5 లో స్ట్రీమింగ్ అవ్వనున్న లూజర్ టీం అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుతూ టీం అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే చేతన్ ఆనంద్ గొప్ప ప్లేయర్, తనను చూసి భారతదేశం గర్వపడుతుంది. అన్నపూర్ణ గురించి చెప్పాలంటే మా నాన్న గారు అన్నిటికీ కాలేజస్, ఎడ్యుకేషన్స్ ఉన్నాయి కానీ సినీ పరిశ్రమకు ఎడ్యుకేషన్ లేదన్న నాన్న గారి ఆలోచన నుండి పుట్టినదే ACFM. అందుకే ఈ కాలేజ్ నుండి ఎంతో మంది నటులు,టెక్నిసిషన్స్ చదువుకొని మంచి పేరు తెచ్చు కుంటున్నారు. అలాగే అన్నపూర్ణ స్టూడియో లో మంచి టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి మేము ఎప్పుడూ ముందు ఉంటాము. అలాగే జీ 5 స్టూడియో తో మా ట్రావెల్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. జీ 5 హోల్ టీం అనురాధకు, నిమ్మకాయల ప్రసాద్, తదితరులందరికీ మా ధన్యవాదాలు. సుప్రియ కూడా చాలా కష్టపడి ఎంతో డెడికేటేడ్ గా వర్క్ చేస్తుంది. ఈ చిత్రానికి పని చేసిన టీం అందరికీ ఆల్ ద బెస్ట్. లూజర్ 2 గా వస్తున్న ఈ సిరీస్ కు ప్రేక్షకులందరూ ఆదరించి ఈ టీం ను ఆశీర్వదించాలని అన్నారు.
Radhe Shyam: మార్చిలో సందడి చేయనున్న రాధేశ్యామ్.? నెట్టింట వైరల్ అవుతోన్న విడుదల తేదీ..