OTT Movies: ఈ వారం ఓటీటీల్లో మస్త్ ఎంటర్‌టైన్మెంట్.. డాకు మహారాజ్‌తో సహా స్ట్రీమింగ్‌కు రానున్న సినిమాలివే

ప్రస్తుతం థియేటర్ల దగ్గర తండేల్ హవా కొనసాగుతోంది. అలాగే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజైన సినిమాలు ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఈ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఫిబ్రవరి మూడో వారంలో కూడా పలు ఆసక్తికర మైన సినిమాలు థియేటర్లలోకి అడుగు పెట్టనున్నాయి.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో మస్త్ ఎంటర్‌టైన్మెంట్.. డాకు మహారాజ్‌తో సహా స్ట్రీమింగ్‌కు రానున్న సినిమాలివే
OTT Movies

Updated on: Feb 17, 2025 | 1:40 PM

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు ఆసక్తికరమైన సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అందులో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది ‘డ్రాగన్‌’ సినిమా. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ ఇందులో హీరోగా నటించాడు. అలాగే మలయాళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. అలాగే స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కొత్త చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక జబర్దస్త్ ధన్ రాజ్, సముద్ర ఖనిల రామం రాఘవం, | బ్రహ్మాజీ, ఆమనిల బాపు సినిమాలపై కూడా పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.

 

ఇవి కూడా చదవండి

ఇక ఓటీటీలోనూ పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి. ఈ వారం అందరి దృష్టి బాలయ్య డాకు మహారాజ్ పై నే ఉంది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఓటీటీలో ఏ మేర రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. అలాగే క్రైమ్ బీట్ వెబ్ సిరీస్ కూడా ఆసక్తి రేపుతోంది. వీటితో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి ఫిబ్రవరి మూడో వారంలో వివిధ ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లపై ఒక లుక్కేద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో

  • జీరోడే (వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 20
  • డాకు మహారాజ్‌ (తెలుగు)- ఫిబ్రవరి 21

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • రీచర్‌3 (వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 20
  • బేబీజాన్- హిందీ సినిమా- ఫిబ్రవరి 20

డిస్నీప్లస్ హాట్‌స్టార్‌

  • ది వైట్‌ లోటస్‌ (వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 17
  • ఊప్స్‌ అబ్‌ క్యా (హిందీ వెబ్ సిరీస్‌)- ఫిబ్రవరి 20
  • ఆఫీస్‌ (తమిళ వెబ్ సిరీస్‌)- ఫిబ్రవరి 21

ఈటీవీ విన్

  • సమ్మేళనం (తెలుగు సినిమా)- ఫిబ్రవరి 20

జీ5

  • క్రైమ్‌ బీట్‌ (వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 21

ఆపిల్‌ టీవీ ప్లస్‌

  • సర్ఫేస్‌2 (వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 21

 

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.