విద్యార్థులకు పరీక్షలు అయిపోయాయి. వేసవి సెలవులు కూడా వచ్చేశాయి. దీంతో థియేటర్లలో పెద్ద సినిమాల సందడి మొదలైంది. ఈ శుక్రవారం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ గా థియేటర్లలోకి అడుగుపెడుతున్నాడు. మృణాళ్ ఠాకూర్ ఇందులో హీరోయిన్. అలాగే మలయాళ బ్లాక్ బస్టర్ ముంజుమ్మెల్ బాయ్స్ తెలుగు వెర్షన్ కూడా వెండితెరపై సందడి చేయనుంది. వీటితో పాటు సందీప్ కిషన్ ప్రాజెక్ట్- జెడ్, భరత నాట్యం, బహుముఖం లాంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. థియేటర్లలో పాటు ఓటీటీలోనూ పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది గోపీ చంద్ నటించిన భీమా. థియేటర్లలో మాస్ ఆడియెన్స్ ను మెప్పించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఓటీటీలో ఏ మేర అలరిస్తుందో చూడాలి. ఇక బిగ్ బాస్ బ్యూటీ దివి నటించిన లంబసింగి కూడా ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. అలాగే హనుమాన్ కన్న, తమిళ్, మలయాళ వెర్షన్లు ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లిష్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటలో సందడి చేయనున్నాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం రండి.
నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న సినిమాలు
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
Buckle up for a wild ride and an epic love story that will leave you breathless 🥹💓#LambasingionHotstar Streaming from 2nd April! @BharatRaj0921 @DiviActor @naveengandhidir @kalyankrishna_k@SreedharSri4u pic.twitter.com/102IJOdab1
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 1, 2024
అమెజాన్ ప్రైమ్ వీడియో
యాపిల్ టీవీ ప్లస్
సోనీలివ్
జీ5 ఓటీటీ
ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి