సినిమా థియేటర్లకు అసలైన కళ ఈ వారం నుంచి రానుంది. ఎందుకంటే డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి ఈ వీక్ లోనే సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. దీంతో కొన్ని రోజుల పాటు థియేటర్లలో కల్కి హడావిడి, హంగామానే ఉండనుంది. ఈ వారం కల్కి మినహా మరే పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. మరోవైపు ఓటీటీలో ఈ వారం సుమారు 20కు పైగా సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. ఈ వారం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా నవ్ దీప్ నటించిన లవ్ మౌళి. బోల్డ్ మూవీ ట్యాగ్ తో థియేటర్లలో అడుగుపెట్టిన ఈ లవ్ స్టోరీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. దీంతో పాటు ఫాహద్ ఫాజిల్ ఆవేశం (హిందీ వెర్షన్), శర్మాజీ కీ భేటీ (హిందీ) వంటి సినిమాలు ఉన్నంతలో కాస్త ఆసక్తిని కలిగిస్తున్నాయి. అయితే వారం మధ్యలో కొన్ని సినిమాలు అనూహ్యంగా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం కూడా ఉంది. మరి జూన్ ఆఖరి వారంలో వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, సిరీస్‌లేవో ఒక లుక్కేద్దాం రండి.
ఉయిర్ తమిళుక్కు (తమిళ్ సినిమా) – జూన్ 25
లవ్ మౌళి (తెలుగు సినిమా) – జూన్ 27
Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.