OTT Movies: మూవీ లవర్స్‌కు పండగే .. ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లివే

|

Jan 24, 2023 | 6:06 AM

సంక్రాంతి సీజన్‌ ముగిసిపోయింది. అయితే కొత్త సినిమాల సందడి మాత్రం తగ్గడం లేదు. థియేటర్లతో పాటు ఓటీటీల్లో ఈ వారం భారీగా సినిమాలు విడుదలవుతున్నాయి.

OTT Movies: మూవీ లవర్స్‌కు పండగే .. ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లివే
Ott Movies
Follow us on

సంక్రాంతి పండగను పురస్కరించుకుని థియేటర్‌లో విడుదలైన సినిమాలన్నీ ప్రేక్షకులను బాగానే అలరించాయి. కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక మూవీ లవర్స్‌ కోసం పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా పెద్ద ఎత్తున సినిమాలను రిలీజ్‌ చేశాయి. ఇప్పుడు సంక్రాంతి సీజన్‌ ముగిసిపోయింది. అయితే కొత్త సినిమాల సందడి మాత్రం తగ్గడం లేదు. థియేటర్లతో పాటు ఓటీటీల్లో ఈ వారం భారీగా సినిమాలు విడుదలవుతున్నాయి. ఇప్పటికే థియేటర్లలో రిలీజైన 18 పేజీస్‌ లాంటి కొత్త సినిమాలతో పాటు వివిధ భాషల్లో తెరకెక్కిన చిత్రాలను ఓటీటీ లవర్స్‌కు అందుబాటులోకి తీసుకురానున్నాయి. అలాగే ఆసక్తికరమైన కంటెంట్‌తో కూడిన వెబ్‌సిరీస్‌లను సిద్ధం చేస్తున్నాయి. మరి జనవరి వారాంతంలో ఆహా, నెట్ ఫ్లిక్స్, అమెజాన్, హాట్ స్టార్, జీ5 తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతోన్న సినిమాలు/వెబ్‌ సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.

ఆహా

  • 18 పేజెస్ (తెలుగు సినిమా) – జనవరి 27

నెట్ ఫ్లిక్స్

  • నార్విక్ (ఇంగ్లిష్ సినిమా) – జనవరి 23
  • బ్లాక్ షన్ షైన్ బేబీ (హిందీ డాక్యుమెంటరీ) – జనవరి 24
  • ఎగైనెస్ట్ ద రోప్స్ (స్పానిష్ వెబ్ సిరీస్) – జనవరి 25
  • బాడీస్ బాడీస్ బాడీస్ (ఇంగ్లిష్ మూవీ) – జనవరి 25
  • డేనియల్ స్పెల్ బౌండ్ (సీజన్ 2) – జనవరి 26
  • 18 పేజెస్ (తెలుగు మూవీ) – జనవరి 27
  • యాన్ యాక్షన్ హీరో (హిందీ మూవీ) – జనవరి 27
  • యూ పీపుల్ (ఇంగ్లిష్ సినిమా) – జనవరి 27
  • లాక్ వుడ్ అండ్ కో (ఇంగ్లిష్ సిరీస్) – జనవరి 27
  • ద ఇన్విటేషన్ (ఇంగ్లిష్ మూవీ) – జనవరి 28
  • రాంగీ (తమిళ సినిమా) – జనవరి 29

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

  • ఎక్స్ ట్రార్డినరీ (ఇంగ్లిష్ సిరీస్) – జనవరి 25
  • డియర్ ఇష్క్ (హిందీ సిరీస్) – జనవరి 26
  • శాటర్ డే నైట్ (మలయాళం) – జనవరి 27

జీ 5

  • అయలీ ((తెలుగు/తమిళ్‌ సిరీస్‌) – జనవరి 26
  • జన్ బాజ్ హిందుస్థాన్ కే (హిందీ సిరీస్) – జనవరి 26

అమెజాన్ ప్రైమ్

  • ఎంగ్గా హాస్టల్ (తమిళ్‌ సినిమా) – జనవరి 27
  • షాట్ గన్ వెడ్డింగ్ (ఇంగ్లిష్ సినిమా) – జనవరి 27
  • యాక్షన్‌ హీరో (హిందీ) – జనవరి 27

యాపిల్ టీవీ ప్లస్

  • స్రింకింగ్ (ఇంగ్లిష్ సిరీస్) – జనవరి 27

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.