OTT Movie: చేతబడి ఇలా కూడా చేస్తారా? వెన్నులో వణుకు పుట్టించే దెయ్యం సినిమా..రాత్రిళ్లు అసలు చూడద్దు

చేతబడులు, బాణామతి లపై ఇప్పటికే చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. తెలుగులోనూ చాలా సినిమాలు రిలీజయ్యాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ దెయ్యం సినిమా మాత్రం హారర్ థ్రిల్లర్ జానర్ లో నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు.

OTT Movie: చేతబడి ఇలా కూడా చేస్తారా?  వెన్నులో వణుకు పుట్టించే  దెయ్యం సినిమా..రాత్రిళ్లు అసలు చూడద్దు
OTT Movie

Updated on: Nov 05, 2025 | 7:45 PM

ప్రస్తుతం ది మోస్ట్ ట్రెండింగ్ సినిమాలేవంటే హారర్ జానర్ చిత్రాలే. భాషతో సంబంధం లేకుండా వీటిని తెగ చూసేస్తున్నారు మూవీ లవర్స్. ముఖ్యంగా ఓటీటీలో ఈ సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు ప్రతి వారం పలు హారర్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక హారర్ థ్రిల్లర్ మూవీనే. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఆడియెన్స్ ను బాగా భయపెట్టింది. భయంకరమైన హారర్ సీన్లకు తోడు సినిమాలోని సస్పెన్స్, ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ ఇస్తాయి. గ్రేస్ అనే అమ్మాయి తన అన్నతో కలిసి ఉంటుంది. చిన్నప్పుడే వీరు తండ్రి చేతిలో వేధింపులకు గురవుతారు. అయితే ఒక రోజు డేవిడ్ సమీపంలోకి అడవిలోకి వెళ్లి ఉన్నట్లుండి కనిపించకుండా పోతాడు. గ్రేస్ పోలీసులన ఆశ్రయించినా ఫలితముండదు. దీంతో ఆమెనే అన్నను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లిపోతుంది. ఇక్కడి నుంచే సినిమాలో ఊహించని ట్విస్టులు ఎదురవుతాయి. అడవిలో గ్రేస్ కు ఒక గుంపు కనిపిస్తుంది. అక్కడ డేవిడ్ బ్యాగ్, డైరీ, రక్తపు చారలు కనిపిస్తాయి.

గ్రేస్ తనకు దొరికిన డేవిడ్ డైరీని చదువుతుంది. అందులో ఆమెకు సంచలన విషయాలు తెలుస్తాయి. డేవిడ్ ను స్థానికులు ఓ దుష్టశక్తికి బలి ఇచ్చారని గ్రేస్ కు అర్థమవుతుంది. డేవిడ్ శవం కూడా అక్కడ కనిపిస్తుంది. మరి ఆ తర్వాత గ్రేస్ ఎలా రియాక్టయ్యింది? తన సోదరుడి చావుకు ప్రతీకారం తీర్చుకుందా? లేదా గ్రామస్తుల చేతిలో ఆమె కూడా ప్రాణాలు కోల్పోతుందా? అసలు డేవిడ్ ఎందుకు అడవిలోకి వెళ్లాడు? అక్కడ స్థానికుల కథ ఏంటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో సాగే ఈ సినిమా పేరు ‘ది బానిష్డ్’ (The Banished). ఇదొక ఆస్ట్రేలియన్ హారర్ థ్రిల్లర్ సినిమా. ఈ ఏడాదే థియేటర్లలో రిలీజై ఆడియెన్స్ ను తెగ భయపెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో తో పాటు యాపిల్ టీవీ లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మంచి హారర్ థ్రిల్లర్ సినిమాలను చూడాలనుకునేవారికి ది బానిష్డ్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీని బాగా ఎంజాయ్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.