Good Luck Ganesha OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న యోగిబాబు కామెడీ ఎంటర్టైన్మెంట్.. ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

|

Jan 17, 2024 | 8:10 AM

గతేడాది ఏప్రిల్ లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కామెడీ ఎంటర్టైన్మెంట్ గా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ తెలుగులోకి వచ్చే్స్తోంది. 'గుడ్ లక్ గణేశా' పేరుతో ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యామం ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది.

Good Luck Ganesha OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న యోగిబాబు కామెడీ ఎంటర్టైన్మెంట్.. ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
Good Luck Ganesha
Follow us on

కోలీవుడ్ నటుడు యోగిబాబుకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులోకి డబ్ అయి సూపర్ హిట్ అందుకున్నాయి. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అతడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇటీవల తమిళంలో యోగిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘యానై ముగతాన్’. గతేడాది ఏప్రిల్ లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కామెడీ ఎంటర్టైన్మెంట్ గా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ తెలుగులోకి వచ్చే్స్తోంది. ‘గుడ్ లక్ గణేశా’ పేరుతో ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యామం ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది.

“ఈ గణేష్ కోసం ఆ గణేష్ వస్తున్నాడు. గుడ్ లక్ గణేశా ఆహాలో వచ్చేస్తోంది. ఈ సినిమా జనవరి 19 నుంచి ప్రీమియర్ అవుతుంది” అంటూ ట్వీట్ చేసింది ఆహా. దీంతో ఇప్పుడు ఓటీటీలో మరో కామెండీ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాలో యోగిబాబు, రమేశ్ తిలక్, ఊర్వశి, కరుణాకరన్, ఉదయ్ చంద్ర కీలకపాత్రలు పోషఇంచారు. ఫ్యాంటసీ కామెడీ మూవీగా వచ్చిన ఈ సినిమారు రజీశ్ మిథిలా దర్శకత్వం వహించారు. భరత్ శంకర్ సంగీతం అందించారు. ఈ సినిమాను గ్రేట్ ఇండియన్ సినిమాస్ బ్యానర్ పై రజీష్ మిథిలా, లిజో జోన్స్ నిర్మించారు.

కథ విషయానికి వస్తే..

వినాయకర్ (యోగిబాబు).. సోమరితనం ఎక్కువ. ఎప్పుడు ఇతరులపై ఆధారపడుతుంటాడు. ప్రజలను మోసం చేస్తుంటాడు. అతడికి మైకేల్ (కరుణాకరన్), మల్లి అక్క (ఊర్వశి) మద్దతుగా ఉంటారు. అయితే ఇలా సోమరిగా ఉన్న వినాయకర్ ముందు వినాయకుడు ప్రత్యక్షమయ్యి.. అతడు జీవిస్తున్న విధానం గురించి ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత వినాయకర్ జీవితం ఎలా మలుపులు తిరిగింది ? అనేది సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.