AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema OTT: ఒకరి గతం.. మరొకరి భవిష్యత్తు.. ఆద్యంతం ఉత్కంఠ.. ఓటీటీని ఊపేస్తున్న సిరీస్..

ఈ వెబ్ సిరీస్ కథానాయకుడు తన భవిష్యత్తుకు సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు ఒక ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. తన భవిష్యత్తుకు ఒక వ్యక్తితో ఉన్న సంబంధాన్ని కనుక్కోవడానికి అతను పడే తపన, అతని ఉత్కంఠభరితమైన కథను ఈ సిరీస్ కథ. ప్రారంభం నుంచి చివరి వరకు ఈ సిరీస్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది.

Cinema OTT: ఒకరి గతం.. మరొకరి భవిష్యత్తు.. ఆద్యంతం ఉత్కంఠ.. ఓటీటీని ఊపేస్తున్న సిరీస్..
Samantar Series
Rajitha Chanti
|

Updated on: Sep 03, 2026 | 6:12 PM

Share

ప్రతి మనిషికి తన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. కానీ ప్రస్తుతం మీరు జీవిస్తున్న ఆ జీవితాన్ని అంతకు ముందే మరో వ్యక్తి బతికాడని తెలిస్తే ఎలా ఉంటుంది. ఆ వ్యక్తి గతమే మీ భవిష్యత్తు అయితే.. ఆ వ్యక్తికి మీ భవిష్యత్తును తెలుసుకునే మార్గం ఉందని మీకు తెలిస్తే ఏమవుతుంది ? మీకు ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఖచ్చితంగా కలుగుతుంది. మీరు మీ భవిష్యత్తును తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటిదే ఈ వెబ్ సిరీస్ కూడా. ఇందులో కథానాయకుడు అయిన కుమార్ మహాజన్ కూడా ఇలాంటి కుతూహలాన్నే అనుభవిస్తాడు. గతంలో సుదర్శన్ చక్రపాణి అనే వ్యక్తి జీవించిన జీవితాన్నే ఇప్పుడు తాను జీవిస్తున్నానని అతను తెలుసుకుంటాడు. ఈ సిరీస్ ఆద్యంతం ఊహించని మలుపులతో సాగుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Yeshanagula : . ఈ పాటలో ఇంత అర్ధం ఉందా.. ఏశనాగుల కట్ట మీద సాంగ్ లిరిక్స్‏కు అర్థం ఇదే..

ఈ వెబ్ సిరీస్‌లో స్వప్నిల్ జోషి, నితీష్ భరద్వాజ్, సాయి తమ్హంకర్ , తేజస్విని పండిట్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ వెబ్ సిరీస్ పౌరాణిక నేపథ్యంతో అల్లిన ప్రతీకారానికి సంబంధించిన ఒక విలక్షణమైన ఆధునిక కథను కలిగి ఉంది. ఒక వ్యక్తి విధి అతని కర్మల ద్వారానే నిర్ణయించబడుతుందని ఈ వెబ్ సిరీస్ చూపిస్తుంది. అదే విధంగా ఒక వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ తన విధిని మార్చుకోలేడని కూడా ఈ సిరీస్ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అతని విధిలో ఏది రాసి ఉందో, అదే జరుగుతుంది. ఈ రెండు ఆలోచనల మధ్య ఉత్కంఠ , రహస్యం అనే జాలిని ఈ సిరీస్‌లో ఎంత అద్భుతంగా క్రియేట్ చేసారంటే.. మీరు ఈ సిరీస్ చూడటానికి కూర్చుంటే, అన్ని ఎపిసోడ్‌లు పూర్తయ్యే వరకు లేవలేరు.

ఎక్కువ మంది చదివినవి : 2026లోనే అట్టర్ ప్లాప్.. ఓటీటీలోకి వచ్చిన వెంటనే ట్రెండింగ్ నంబర్ వన్.. ఏ మూవీ అంటే..

మనం మాట్లాడుకుంటున్న ఆ వెబ్ సిరీస్ పేరు ‘సమంతర్’. దీని మొదటి సీజన్ మార్చి 2020లో, రెండవ సీజన్ జూలై 2021లో విడుదలయ్యాయి. ఈ మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ రెండు సీజన్‌లను మీరు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అయిన అమెజాన్ MX ప్లేయర్‌లో చూడవచ్చు. ఈ సిరీస్ IMDbలో పదికి 8.2 బలమైన రేటింగ్‌ను పొందింది. ఊహించని మలుపులు, ట్విస్టులతో ఈ సిరీస్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ సినిమాతోనే నా జీవితం మలుపు తిరిగింది.. ఆయన మూవీ అప్పట్లో సంచలనం.. తనికెళ్ల భరణి.

ఎక్కువ మంది చదివినవి : Cinema : సినిమా అంటే ఇది భయ్యా.. ఒక్క దెబ్బతో టాక్సిక్, దురంధర్ చిత్రాలు వెనక్కు.. థియేటర్లను షేక్ చేస్తున్న మూవీ..

Follow Us
యూనిఫామ్‌లో పెళ్లికి హాజరైన జవాన్లు..తండ్రి స్థానంలో నిలిచి...
యూనిఫామ్‌లో పెళ్లికి హాజరైన జవాన్లు..తండ్రి స్థానంలో నిలిచి...
ఒక్క ముద్దతో వెయ్యేనుగుల బలం.. పిల్లలకు ఇదే వరం
ఒక్క ముద్దతో వెయ్యేనుగుల బలం.. పిల్లలకు ఇదే వరం
కాశీ యాత్రకు వెళ్తున్నారా? తిరిగి వచ్చేటప్పుడు ఈ 4 పవిత్ర వస్తువు
కాశీ యాత్రకు వెళ్తున్నారా? తిరిగి వచ్చేటప్పుడు ఈ 4 పవిత్ర వస్తువు
మీరు మహానుభావులు.. 1.16 లక్షలకు పైగా చెట్లు నాటిన గ్రామం ఇదే !
మీరు మహానుభావులు.. 1.16 లక్షలకు పైగా చెట్లు నాటిన గ్రామం ఇదే !
ఏపీలోని లిక్కర్ షాపుల్లో సూపర్ మార్కెట్ తరహా బిల్లింగ్..
ఏపీలోని లిక్కర్ షాపుల్లో సూపర్ మార్కెట్ తరహా బిల్లింగ్..
రైతును రెండు నెలల్లో లక్షాధికారిని చేసే పంట
రైతును రెండు నెలల్లో లక్షాధికారిని చేసే పంట
అల్లు అర్హ బర్త్‌ డే.. శ్రీలంకలో అల్లు ఫ్యామిలీ.. ఫొటోస్ ఇదిగో
అల్లు అర్హ బర్త్‌ డే.. శ్రీలంకలో అల్లు ఫ్యామిలీ.. ఫొటోస్ ఇదిగో
బ్రష్,చేతులు తగలకుండానే టాయిలెట్ శుభ్రంగా ఉండాలా?ఈ సింపుల్ ట్రిక్
బ్రష్,చేతులు తగలకుండానే టాయిలెట్ శుభ్రంగా ఉండాలా?ఈ సింపుల్ ట్రిక్
ఇండస్ట్రీలో నాగార్జున అన్నయ్య అని పిలిచే ఏకైక నటుడు.
ఇండస్ట్రీలో నాగార్జున అన్నయ్య అని పిలిచే ఏకైక నటుడు.
పబ్లిక్‌లో ముద్దు.. ఇండియాలో నిజంగా నేరమా ? రూల్స్ ఏంటంటే ??
పబ్లిక్‌లో ముద్దు.. ఇండియాలో నిజంగా నేరమా ? రూల్స్ ఏంటంటే ??