Cinema : ఏం సినిమా రా బాబూ.. 10 ఏళ్లుగా బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ సంచలనమే..
ప్రస్తుతం ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ దూసుకుపోతున్నాయి. హారర్, సస్పెన్స్, రొమాంటిక్, థ్రిల్లర్ ఇలా ఒక్కటేమిటీ అనేక సినిమాలు ప్రేక్షకులను అలరిసత్తున్నాయి. కానీ మీకు తెలుసా.. దాదాపు 10 సంవత్సరాలుగా ఒక సినిమా బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. అలాగే అటు ఓటీటీలోనూ బీభత్సం సృష్టిస్తుంది. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే.

ప్రస్తుతం చిన్న సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలు థియేటర్లలో సత్తా చాటుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై రికార్డులు తిరగరాస్తున్నాయి. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద అంతగా రెస్పాన్స్ రాని మూవీస్ ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ కూడా ఆ జానర్ లోకి వస్తుంది. కేవలం రూ.80 కోట్లతో నిర్మించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 623 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అయితే విడుదలైన సుమారు పది సంవత్సరాలు గడిచినా, బాక్సాఫీస్ వద్ద సాధించిన రికార్డులతో పాటు ఇప్పటికీ ఓటీటీలలో సంచలనం సృష్టిస్తున్న చిత్రం ఇది అని చెప్పుకోవాలి. మనం ఇంతగా మాట్లాడుకుంటున్న సినిమా ఏంటంటే.. బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘సుల్తాన్’.
ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..
2016 జూలై 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘సుల్తాన్’ చిత్రం బాలీవుడ్ చిత్రసీమలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రముఖ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన అనుష్క శర్మ కథానాయికగా నటించింది. కేవలం రూ. 80 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 623.33 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త వసూళ్లను సాధించింది. అందులో భారతదేశంలోనే దాదాపు రూ. 421 కోట్లకు పైగా రాబట్టి సల్మాన్ ఖాన్, అనుష్క శర్మల కెరీర్‌లోనే అతిపెద్ద మైలురాయిగా నిలిచింది.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..
ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించడానికి కారణం అందులోని బలమైన కథ ,ఎమోషన్స్. హర్యానాకు చెందిన సుల్తాన్ అలీ ఖాన్ అనే రెజ్లర్ తన కొడుకు మరణం తర్వాత రెజ్లింగ్‌కు దూరమై సాధారణ జీవితం గడుపుతుంటాడు. కానీ, తన కోల్పోయిన గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందేందుకు వయస్సును, శారీరక పరిమితులను అధిగమించి మళ్లీ రింగ్‌లోకి ఎలా అడుగుపెట్టాడనేది ప్రధాన కథాంశం. విశాల్-శేఖర్ స్వరపరిచిన 9 పాటలు కూడా అప్పట్లో చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. థియేటర్లలో విడుదలై పదేళ్లు పూర్తవుతున్నా, ‘సుల్తాన్’ సినిమా హవా తగ్గలేదు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‌ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..
ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..
