
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో దేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇటీవల 50వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు మహేష్. ఐదు పదుల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ.. హాలీవుడ్ హీరోలాంటి కటౌట్ తో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. అంతేకాదు.. మహేష్ కు అమ్మాయిల ఫాలోయింగ్ సైతం ఎక్కువే. మహేష్ తమ కెరీర్ మొత్తంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక సినిమా అటు బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. అలాగే గత నాలుగేళ్లుగా ఓటీటీలో దూసుకుపోతుంది. ఇప్పటివరకు నెంబర్ వన్ మూవీగా హిస్టరీ రిపీట్ చేసింది ఈ సినిమా. ఇంతకీ ఆ మూవీ పేరేంటో తెలుసా..?
ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?
మహేష్ బాబు ప్రధాన పాత్రలో నిర్మించిన ఈ మూవీ దాదాపు 75 కోట్లతో నిర్మించారు. ఐదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసింది. సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ మూవీ మాత్రం ఓటీటీలో దూసుకుపోతుంది. ఆ సినిమా మరెదో కాదు.. సరిలేరు నీకెవ్వరు. 2020లో విడుదలైన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇందులో మహేష్ బాబు, రష్మిక మందన్న, విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ వంటి అద్భుతమైన నటులు నటించారు.
ఇవి కూడా చదవండి : Ramya Krishna: రమ్యకృష్ణ కొడుకును చూశారా..? తనయుడితో కలిసి శ్రీవారి దర్శనం.. వీడియో వైరల్..
ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. దాదాపు 75 కోట్లతో తెరకెక్కించిన మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.214.8 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికీ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి : Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..
ఇవి కూడా చదవండి : Actress : అబ్బబ్బ.. ఏం అందం రా బాబూ.. 42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..