Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

ఈమధ్య కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ అందుకున్న సినిమాలతోపాటు.. ఏ రేంజ్ అంచనాల మధ్య అడియన్స్ ముందుకు వచ్చి డిజాస్టర్ అయిన చిత్రాలు చాలా ఉన్నాయి. అందులో ఈ మూవీ ఒకటి. థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోంది.

Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
Movie

Updated on: Aug 09, 2025 | 12:02 PM

ఇటీవల తెలుగు మంచి హైప్ మధ్య విడుదలైన సినిమా.. ఊహించని విధంగా అట్టర్ ప్లాప్ అయ్యింది. దాదాపు రూ.75 కోట్లతో నిర్మించిన ఈ మూవీ.. కేవలం 9.22 కోట్లు మాత్రమే రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన ఈ సినిమా.. ప్రస్తుతం ఓటీటీని శాసిస్తుంది. ఇంతకీ ఏ సినిమానో తెలుసా.. అదే తమ్ముడు. జూలై 4న విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన 2 గంటల 31 నిమిషాల తెలుగు యాక్షన్-థ్రిల్లర్ మూవీలో నితిన్ హీరోగా నటించగా.. కన్నడ బ్యూటీ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, సీనియర్ హీరోయిన్ లయ కీలకపాత్రలు పోషించారు. విడుదలకు ముందు మంచి క్యూరియాసిటి నెలకొన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. కానీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంది.

ఇవి కూడా చదవండి :  Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?

ఈ సినిమాలో నాటకీయ కథాంశం, భావోద్వేగ సీన్స్ ఆకట్టుకున్నాయి. అక్క, తమ్ముడి మధ్య అనుబంధం, ఎమోషన్ చుట్టూ సాగే ఈ సినిమాను దాదాపు రూ. 75 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. బాక్సాఫీస్ వద్ద రూ. 9.22 కోట్ల కలెక్షన్ మాత్రమే సాధించింది. IMDB రేటింగ్ 3.8 సాధించింది. కానీ ఇప్పుడు ఓటీటీలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆగస్ట్ 1న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు దూసుకుపోతుంది. ప్రస్తుతానికి తమ్ముడు నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..