
ఇటీవల కాలంలో సినీప్రియులు ఎక్కువగా సరికొత్త కంటెంట్ చిత్రాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈమధ్య కాలంలో హారర్, రొమాంటిక్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా బాక్సాఫీస్ షేక్ చేసింది. క్రైమ్ థ్రిల్లర్, కోర్టు డ్రామాగా వచ్చి ఆద్యంతం సినీప్రియులను కట్టిపడేసింది. 2021లో విడుదలై అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన ఈ లీగల్ థ్రిల్లర్ గా, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. సమాజంలో అణగారిన వర్గాల కష్టాలను ప్రపంచానికి చాటింది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. ఆ తర్వాత ఓటీటీలోనూ దూసుకుపోయింది. అదే జై భీమ్. ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించి మెప్పించాడు. ఇన్నాళ్లు మాస్ యాక్షన్ హీరోగా కనిపించిన సూర్య.. ఇందులో మాత్రం లాయర్ పాత్రలో నటించారు.
ఈ సినిమాలో అద్భుతమైన నటనతోనే కాకుండా సమాజంలో న్యాయం కోసం పోరాడే ఓ నిజాయితీపరుడి ఆవేశాన్ని, ఆవేదనను ప్రేక్షకుల కళ్లకు కట్టనట్లుగా చూపించారు. ఈ సినిమాకు ఐఏండీబీలో 8.7 రేటింగ్ కలిగి ఉంది. ఈ చిత్రంలో గ్రామీణ, గిరిజన సమాజాల కష్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. దాదాపు 2 గంటల 45 నిమిషాల నిడివితో ఆద్యంతం ఉత్కంఠతోపాటు ప్రతిక్షణం గూస్ బంప్స్ తెప్పించే విజువల్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. 1990లో తమిళనాడులో జరిగిన దారుణ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు డైరెక్టర్ టీజే జ్ఞానవేల్.
థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. సమాజంలో అన్యాయానికి గురవుతున్న వర్గాల గురించి.. వారిపై జరిగే అన్యాయాలను, వారి హక్కుల కోసం పోరాడే ఓ లాయర్ స్టోరీని ఈ సినిమాతో అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు డైరెక్టర్ టీజే జ్ఞానవేల్. ఇందులో సూర్యతోపాటు లిజోమోల్ జోస్, మణికందన్, రజిషా విజయన్, జిజోయ్ రాజగోపాల్ కీలకపాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి :
Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?
Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‌తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..