
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సినిమా కె- ర్యాంప్. జైన్స్ నాని తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. అలాగే నరేష్ వీకే, సాయి కుమార్, కామ్నా జెఠ్మలానీ కీలక పాత్రలు పోషించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమాలో బూతులు ఉండడంతో మొదట నెగెటివ్ టాక్ వచ్చినా ఆ తర్వాత సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లింది కే- ర్యాంప్. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. ముఖ్యంగా ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా అనే సాంగ్ కు కిరణ్ అబ్బవరం చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో బాగా వైరలైంది. ఈ కారణంగానే ఎప్పుడో రిలీజైన రాజశేఖర్ సినిమా ఆయుధం మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. చాలా మంది ఈ పాటను రీక్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ చేశారు. థియేటర్లలో భారీ కలెక్షన్లు రాబట్టిన కే ర్యాంప్ సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరపడింది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. కొన్ని రోజుల క్రితమే కిరణ్ అబ్బవరం సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అందుకు తగ్గట్టుగానే శనివారం (నవంబర్ 15) అర్ధరాత్రి నుంచే కే- ర్యాంప్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేశ్ దండ,
శివ బొమ్మక్ నిర్మించిన కే ర్యాంప్ సినిమాలో మురళీధర్ గౌడ్, వెన్నెల కిశోర్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టిన కె ర్యాంప్ సినిమాకు ఐఎమ్‌డీబీ లో పదికి 8.3 రేటింగ్ దక్కడం విశేషం. మమరి ఈ సూపర్ హిట్ సినిమాను థియేటర్లలో మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఆహా ఓటీటీలో కె ర్యాంప్ మూవీని చూసి కడుపుబ్బా నవ్వుకోండి.
Grab your limited-time Aha TimeBomb offer before it blows up! 💥
🎬 #KRamp premieres Nov 15, experience it in 4K & Dolby Atmos only with #AhaGold⏰ Offer goes LIVE TODAY | 6PM–11PM! pic.twitter.com/8tt7FjgQVk
— ahavideoin (@ahavideoIN) November 14, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.