OTT Movie: దేవుడంటూ సీరియల్ కిల్లర్ అరాచకాలు.. OTTలో టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.8 రేటింగ్

గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియెన్స్ కు పిచ్చి పిచ్చిగా నచ్చేశాయి. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు 9.8 రేటింగ్ దక్కడం విశేషం. ఇప్పుడీ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోనూ అదరగొడుతోంది.

OTT Movie: దేవుడంటూ సీరియల్ కిల్లర్ అరాచకాలు.. OTTలో టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.8 రేటింగ్
I Am God Movie

Updated on: Dec 28, 2025 | 7:45 PM

ఈ వారం పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. ఇందులో ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా ఉంది. గత నెలలోనే థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ భరిత సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కుమంచి థ్రిల్ అందించాయి. టాక్ కు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద ఈ క్రైమ్ థ్రిల్లర్ కు మంచిగానే కలెక్షన్లు వచ్చాయి. ఇక ఐఎమ్ డీబీలోనూ ఈమూవీకి 10కి రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా కథ ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో ఒక సైకో కిల్లర్ మాస్కు వేసుకుని వరుస హత్యలు చేస్తుంటారు. పైగా తాను దేవుడినని చెప్పుకుంటాడు. అదే సమయంలో కాలేజీలో ఓ జంట ప్రేమ కథ కూడా సమాంతరంగా నడుస్తుంది. మరి అసలు ఈ రెండు స్టోరీలకు లింక్ ఏమిటి? ఆ సైకో కిల్లర్ నేపథ్యమేంటి? ఎందుకు వరుస హత్యలు చేశాడు? చివరకు ఏమైంది? అన్నది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాల్సిందే

ఈ కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ఐ యామ్ గాడ్. రవి బీ గౌడ తెరకెక్కించిన ఈ సినిమాలో రవి గౌడతోపాటు విజేత పరీక్, రవిశంకర్, అవినాష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 7న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 26న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రస్తుతం ఐ యామ్ గాడ్ సినిమా ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో రన్ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మూవీని అర్థం చేసుకోవచ్చు. వీకెండ్ లో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

సన్ నెక్ట్స్ లో ఐ యామ్ గాడ్ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.