Puneeth Rajkumar: ఓటీటీలోకి పునీత్ రాజ్‏కుమార్ చివరి సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

|

Mar 18, 2023 | 9:26 PM

పునీత్ మరణానికి ముందు గంధడ గుడి అనే వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరి ఫిలిం తీశారు. ఈ మూవీ గతేడాది ఆయన వర్దంతి సందర్భంగా థియేటర్లలో రిలీజ్ చేశారు.

Puneeth Rajkumar: ఓటీటీలోకి పునీత్ రాజ్‏కుమార్ చివరి సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
Puneeth Raj Kumar
Follow us on

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణాన్ని ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకులేకపోతున్నారు. తమ అభిమాన హీరో ఈ లోకాన్ని వదిలి సంవత్సరం గడిచినా.. పునీత్ జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ‘అప్పు’ అంటూ ప్రేమగా పిలుచుకునే కన్నడిగుల ఆరాధ్య నటుడు పునీత్.. 2021లో గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో కన్నడ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కన్నడతోపాటు.. తెలుగు, తమిళ్ నటీనటులతో అప్పు స్నేహసంబంధాలను కొనసాగించేవారు. పునీత్ మరణానికి ముందు గంధడ గుడి అనే వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరి ఫిలిం తీశారు. ఈ మూవీ గతేడాది ఆయన వర్దంతి సందర్భంగా థియేటర్లలో రిలీజ్ చేశారు.

తమ ఆరాధ్య నటుడి చివరి సినిమా కావడంతో ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు అభిమానులు. కర్ణాటక అడవుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. అటు థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి

ప్రకృతి ప్రేమికుడైన పునీత్.. కర్ణాటక ప్రకృతి అందాలను నేటి యువత.. విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ డాక్యుమెంటరిని తీశారని అన్నారు ఆయన భార్య అశ్విని. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగా వ్యవహరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.