OTT Movie: వరుస హత్యలతో ఊరు వల్లకాడు.. ఓటీటీలో కాంతార, శంభాల లాంటి సినిమా.. అద్దిరిపోయే ట్విస్టులు

ఆ మధ్యన వచ్చిన కాంతార, కాంతార ఛాప్టర్ 1, శంభాల సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అలాంటి ఒక మూవీనే ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. జానపద కథల నేపథ్యానికి హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి ఈ మూవీని రూపొందించారు.

OTT Movie: వరుస హత్యలతో ఊరు వల్లకాడు.. ఓటీటీలో కాంతార, శంభాల లాంటి సినిమా.. అద్దిరిపోయే ట్విస్టులు
OTT Movie

Updated on: Jan 26, 2026 | 9:42 PM

థియేటర్లు అయినా, ఓటీటీలైనా ఇప్పుడు డివోషనల్ అండ్ హారర్ మూవీస్ దే హవా. ఆ మధ్యన వచ్చిన కాంతారా సిరీస్ సినిమాలు కానీ , ఇటీవల తెలుగులో వచ్చిన శంభాల సినిమా ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల వచ్చిన శంభాల సినిమాలోని . గ్రామీణ నేపథ్యం, దట్టమైన అడవులతో కూడిన విజువల్స్ ఓటీటీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ అందించాయి. ఇప్పుడు అలాంటి ఓ హారర్ థ్రిల్లర్ సినిమానే ఓటీటీలో ఉంది. ఈ సినిమా గతేడాది థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో ఈ మూవీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కర్ణాటకలోని కొల్లూరు అనే ఒక గ్రామం చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. అక్కడ ఏటా ‘కోన’ అనే పేరిట ఒక ఆచారం జరుగుతుంటుంది. ఈ ఆచారంలో భాగంగా అక్కడి ప్రజలు ఒక దున్నపోతును బలి ఇస్తుంటారు. గ్రామంలో దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండేందుకు ఏటా కచ్చితంగా ఇలా దున్నపోతును బలి ఇవ్వాలని ఆ గ్రామస్తులు గట్టిగా నమ్ముతుంటారు. అయితే ఒకానొక సందర్భంలో ఊరిలో ఈ కోన ఆచారం ఆగిపోతుంది. దీంతో గ్రామంలో భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. వరుస హత్యలు గ్రామాన్ని అతలాకుతలం చేస్తాయి. మరి ఈ హత్యలు ఆగాయా? లేదా? అసలు ఈ హత్యలకు కారణమేంటి? ఎవరు చేస్తున్నారు? అన్నప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు అంతర్లీనంగా కామెడీ కూడా ఉండే ఈ సూపర్ హిట్ సినిమా పేరు కోన. ఇదొక కన్నడ సినిమా. హరి కృష్ణ తెరకెక్కించిన ఈ మూవీలో కోమల్ కుమార్, తనీషా కుప్పండ, నమ్రత గౌడ మరియు విజయ్ చెందూర్ ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవలే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ జీ5తో పాటు Airtel Xstream Play ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో మూవీని ఎంజాయ్ చేయవచ్చు. మంచి హారర్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకునేవారికి కోన సినిమా ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.